20 కోట్ల మంది పిల్లల ఆహార హాహాకారం

కొందరికి చిరుతిండితో ఒబిసిటి మరెందరికో దక్కని అన్నంతో డొక్కలు మేల్కొనాలని యునిసెఫ్ పిలుపు న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద 20 కోట్ల మంది ఐదేళ్ల లోపు పిల్లలు అత్యల్ప ఆహారం లేదా అతి తిండి పరిణామంతో బాధపడుతున్నారు. ఐరాసకు చెందిన బాలల వికాస అధ్యయన సంస్థ యునిసెఫ్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిన్నారులకు అందాల్సిన ఆహారం విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. ఓ వైపు వయస్సుకు […] The post 20 కోట్ల మంది పిల్లల ఆహార హాహాకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొందరికి చిరుతిండితో ఒబిసిటి
మరెందరికో దక్కని అన్నంతో డొక్కలు
మేల్కొనాలని యునిసెఫ్ పిలుపు

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద 20 కోట్ల మంది ఐదేళ్ల లోపు పిల్లలు అత్యల్ప ఆహారం లేదా అతి తిండి పరిణామంతో బాధపడుతున్నారు. ఐరాసకు చెందిన బాలల వికాస అధ్యయన సంస్థ యునిసెఫ్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిన్నారులకు అందాల్సిన ఆహారం విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. ఓ వైపు వయస్సుకు తగ్గట్టుగా సరైన తిండి లేకుండా ఉండే బలహీనపు పిల్లలు, మరో వైపు వయస్సుకు మించి అతి ఎక్కువగా తిండితో స్థూలకాయులు అవుతున్న వారు ఉన్నారని, దీనితో అపసవ్య పరిస్థితి ఏర్పడుతోందని విశ్లేషించారు. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు ఉండే పిల్లలలో మూడింట రెండొంతుల వరకూ సరైన పోషకాహారం అందడం లేదని వెల్లడించారు.

బాల్య దశలోనే ఆహారపు అలవాట్లపై తగు జాగ్రత్తలు తెలియచేయాల్సి ఉంటుందని, సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకునే విషయం ఈ దశలోనే కీలకమని తెలిపారు. ఓ వైపు నిజంగానే తిండి దక్కక సరైన ఎదుగుదల లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలలు, మరో వైపు అతి ఎక్కువగా తిండి అందుబాటులో ఉండటంతో చిన్నతనంలోనే ఊబకాయులు అవుతున్న వారు సమాజంలో కన్పిస్తున్నారని తెలిపారు. ఓ వైపు సాంకేతికపరంగా విరివిగా ప్రచారం జరుగుతోంది. సాంస్కృతిక ఆచార వ్యవహారాల కోణంలోనూ జాగ్రత్తలకు వీలుంది. కొన్ని దశాబ్దాలుగా సామాజిక పురోగతి కూడా ఉంది. పిల్లలు సక్రమ రీతిలో తినకపోతే వారు సవ్యంగా బతకలేరనే అత్యంత కీలకమైన మౌలికమైన అంశం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

యునిసెఫ్ నిర్థారణల మేరకు 14 కోట్ల మందికి పైగా 5 ఏళ్ల లోపు పిల్లలు వయస్సుకు తగ్గట్లు ఎత్తు పెరగలేకపోతున్నారు. అరకోటి మంది పిల్లలు తమ ఎత్తుకు తగ్గ బరువుతో ఉండటం లేదు. దీనితో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.34 కోట్ల మంది పిల్లల్లో విటమిన్ ఎ, ఐరన్ వంటి అత్యవసర పోషకపదార్థాలు లేమి నెలకొని ఉంది. ఇక 4 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ఆరు నెలల నుంచి 2 ఏళ్లలోపు ఉన్న పిల్లల్లో దాదాపు 45 శాతం వరకూ పండ్లు కూరగాయల ఆహారం దక్కని స్థితిలో ఉన్నారు. ఇక ఈ వయస్సులోని వారిలో దాదాపు 60 శాతం మంది వరకూ గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు లేదా మాంసం తీసుకోని దశలో ఉన్నారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారిలో చిరుతిండ్లకు , అనారోగ్యకర ఆహారపు అలవాట్లు పెరుగుతూ ఉంటాయి. సరైన విధంగా పెద్దల మార్గదర్శకత్వం లేకపోవడంతో కేవలం రుచికరమైన తిండికే పిల్లలు అలవాటు పడి తరువాత అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారని వెల్లడైంది.

Alarmingly 20 million children malnourished worldwide

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 20 కోట్ల మంది పిల్లల ఆహార హాహాకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: