సల్మాన్‌కు జోడీగా దిశా

  బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ పైకి చాలా మొరటుగా, కటువుగా కనిపించినా కూడా ఆయన చాలా సున్నితమంటూ ఆయనతో వర్క్ చేసిన చాలా మంది హీరోయిన్లు అంటూ ఉంటారు. ఆయనకు మంచితనం, సాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఆయన ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట నిలుపుకుంటాడు. తనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యతనివ్వడం సల్మాన్‌కు మొదటి నుండి ఉన్న మంచి గుణం అంటారు పలువురు హీరోయిన్లు. […] The post సల్మాన్‌కు జోడీగా దిశా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ పైకి చాలా మొరటుగా, కటువుగా కనిపించినా కూడా ఆయన చాలా సున్నితమంటూ ఆయనతో వర్క్ చేసిన చాలా మంది హీరోయిన్లు అంటూ ఉంటారు. ఆయనకు మంచితనం, సాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఆయన ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట నిలుపుకుంటాడు. తనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యతనివ్వడం సల్మాన్‌కు మొదటి నుండి ఉన్న మంచి గుణం అంటారు పలువురు హీరోయిన్లు. సల్మాన్ చిత్రం ‘భారత్’లో సెకండ్ హీరోయిన్‌గా దిశా పటానీ నటించింది. ఈ సినిమాలో దిశా పాత్ర చాలా తక్కువగా ఉంటుంది.

అయినా కూడా సల్మాన్‌తో నటించే ఉద్దేశ్యంతో ఆమె ఈ పాత్రకు ఓకే చెప్పింది. ఆ సమయంలోనే తన నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒక దాంట్లో ఫుల్‌లెంగ్త్ హీరోయిన్ పాత్రనిస్తానంటూ సల్మాన్& దిశా పటానీకి హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది ప్రభుదేవా దర్శకత్వంలో చేయబోతున్న ‘రాధే’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు గాను దిశా పటానీని ఎంపిక చేసినట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు.

Disha paired with Salman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సల్మాన్‌కు జోడీగా దిశా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: