ముచ్చటగొలిపే సన్నివేశాలు

  ఇటీవలే ‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. ఆ తరువాత షెడ్యూల్‌ని అమెరికాలో షూట్ చేస్తారు. ఇక మంగళవారం సాయి […] The post ముచ్చటగొలిపే సన్నివేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇటీవలే ‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. ఆ తరువాత షెడ్యూల్‌ని అమెరికాలో షూట్ చేస్తారు. ఇక మంగళవారం సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగేకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ముచ్చటగా ఉన్నాయి.

తాత, మనవడు మధ్య సంబంధాన్ని ఈ సినిమాలో అందంగా చూపించడం జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్‌ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో న్యూ లుక్‌లో చూపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కుటుంబ బంధాలు, విలువలను ఎమోషనల్‌గా చిత్రీకరిస్తున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతోంది. జిఎ2, యువి పిక్చర్స్ బ్యానర్‌లలో ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. విజయ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ః తమన్, ఎడిటర్‌ః – కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌ః రవీందర్.

Family emotions in Prathi Roju pandage movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముచ్చటగొలిపే సన్నివేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: