ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి!

  ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా తపించిపోతుంది. తనకే ఏదో అవుతున్నట్లు తల్లడిల్లుతుంది. తన కుటుంబం బాగుంటే చాలనుకుంటూ తన గురించి పట్టించుకోదు స్త్రీ. తనకూ కాస్తంత విశ్రాంతి అవసరమనే విషయాన్నే మర్చిపోతుంది. అందరికీ సమయానికి అన్నీ సమకూరుస్తూ వాళ్ల సంతోషమే తనదనుకుంటుంది. అలా చివరకు తనే అనారోగ్యానికి గురవుతుంటుంది. అప్పుడుగానీ తనను తాను ఎంత బాధపెట్టుకున్నానో గుర్తుతెచ్చుకుంటుంది. అలా ఆమె తన బాధను, విచారాన్ని వ్యక్తంచేయకుండా లోలోపలే కుంగిపోవడం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతోందని చెబుతున్నారు […] The post ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా తపించిపోతుంది. తనకే ఏదో అవుతున్నట్లు తల్లడిల్లుతుంది. తన కుటుంబం బాగుంటే చాలనుకుంటూ తన గురించి పట్టించుకోదు స్త్రీ. తనకూ కాస్తంత విశ్రాంతి అవసరమనే విషయాన్నే మర్చిపోతుంది. అందరికీ సమయానికి అన్నీ సమకూరుస్తూ వాళ్ల సంతోషమే తనదనుకుంటుంది. అలా చివరకు తనే అనారోగ్యానికి గురవుతుంటుంది. అప్పుడుగానీ తనను తాను ఎంత బాధపెట్టుకున్నానో గుర్తుతెచ్చుకుంటుంది. అలా ఆమె తన బాధను, విచారాన్ని వ్యక్తంచేయకుండా లోలోపలే కుంగిపోవడం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతోందని చెబుతున్నారు నిపుణులు. తాత్కాలిక విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఆమె తన జీవితాన్నే కోల్పోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనలలో పురుషుల కంటే మహిళలు చాలా త్వరగా మరణిస్తారని నిర్ధారిస్తున్నారు. 

ప్రపంచంలో రెండు మిలియన్ల కంటే ఎక్కువగా బ్రెస్ట్, ఓవేరియన్ కేన్సర్‌తో మహిళలు పోరాడుతున్నారు. చాలాకాలం నుంచి మహిళలు ఎక్కువగా మధుమేహానికి గురి అవుతున్నారు. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. అనీమియా కూడా మరణానికి కారణమవుతుంది. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడాలన్నా, మరికొంత కాలం జీవించాలన్నా అనేక ట్రీట్‌మెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విషయాల్లో, హోం రెమెడీస్ కూడా సహాయపడతాయి. అయితే హోం రెమెడీస్, వ్యాధులను ప్రారంభ దశలో కనుగొన్నప్పుడు ఉపయోగించడం వల్ల కొంతవరకూ నివారించుకోవచ్చు. మహిళలు నెలకొకసారి వైద్యులను సంప్రదించి మెడికల్ టెస్టులు, హెల్త్ చెకప్స్ చేయించుకోవడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ఇలాంటి మెడికల్ విజిట్స్ వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పాతికేళ్లు దాటిన ప్రతి మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎంత బిజీగా ఉన్నా ఎంతోకొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం కేటాయించాలి.

హార్ట్ డిసీజ్: మహిళల్లో 38శాతం మంది మొదటి హార్ట్ అటాక్ సమయంలోనే మరణిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ధూమపానం అలవాటు ఉన్న మహిళల్లో హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడి తద్వారా హార్ట్ అటాక్, గుండె సంబంధిత వ్యాధులకు కారణం అవుతున్నాయి.

బ్రెస్ట్ కేన్సర్: మహిళలు 35సంవత్సరాల తర్వాత మామోగ్రామ్ టెస్టును తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల బ్రెస్ట్ హెల్తీగా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. 23ఏళ్ళతర్వాత ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా సెల్ఫ్ చెకప్ వల్ల బ్రెస్ట్‌లో ఏర్పడే అసాధారణ కణుతులు గుర్తించినట్లయితే అది బ్రెస్ట్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నంగా గుర్తించాలి.

సర్వైకల్ కేన్సర్: సర్విక్స్‌లోని కణాల్లో కేన్సర్ కణుతులు ఏర్పడతాయి. మహిళలు మల్టిపుల్ సెక్సువల్ సంబంధాల్ని కలిగి ఉండటం సర్వైకల్ కేన్సర్ డెవలప్‌మెంట్‌కు కారణం అవుతుంది. దీనికి ఎలాంటి లక్షణాలుండవు. కేన్సర్ పూర్తిగా ఫార్మ్ అయిన తర్వాత లక్షణాలు కనబడతాయి.

ఓవేరియన్ కేన్సర్: ఓవేరియన్ కేన్సర్ ఓవరీస్‌లో వస్తుంది. మహిళల్లో వచ్చే అత్యంత ముఖ్యమైన కేన్సర్ ఇది. ప్రపంచంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో ఈ కేన్సర్ బారిన పడుతున్నారు. ఓవేరియన్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నాలేవీ లేవు.

డిప్రెషన్: సోషియల్ సిగ్మా వల్ల, చాలామంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకు కారణం డిప్రెషన్, వర్క్ ఫీల్డ్ నిస్సహాయస్థితి, ఇంటా, బయటా డామినేటెడ్ పరిస్థితులు ఇందుకు కారణం అవుతాయి.

డయాబెటిస్: మహిళల్లో 28ఏళ్ల తర్వాత టైప్ 2 డయాబెటిస్ చాలా సాధారణమైపోయింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని బ్యాలెన్స్ చేయలేనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

కిడ్నీ సమస్యలు: హై బ్లడ్‌ప్రెజర్, హార్ట్ సమస్యలు ప్రతీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉంటున్నాయి.
మహిళల్లో కిడ్నీ వ్యాధులు కూడా సాధారణంగా మారాయి. కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు బ్లీక్, యూరిన్ బ్లడ్ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు.

అనీమియా: అనీమియాకు కారణాలు అనేకం. ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా లేదా అధికంగా ఉండటం కూడా అనీమియాకు కారణం అవుతుంది. ఈ హెల్త్ సమస్య గర్భవతుల్లో, అలాగే ఫీటస్‌లో ఇతర సమస్యలకు దారితీస్తుంది.

Medical Tests Every Woman Needs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: