అట్లతద్దోయ్ ఆరట్లోయ్!

అట్లతద్ది నోము కథ అట్ల తద్ది నోము నోచుకునే వారు చివరిలో ఈ కథ చుదువుకుంటారు. పూర్వం ఒక రాజ్యంలో రాజు, మంత్రి, సేనాపతి, పురోహితుడు నలుగురికీ నలుగురు కూతుళ్లు ఉండేవారు. వాళ్లు వాళ్లు నలుగురూ ఎంతో స్నేహంగా వుండేవారు. ఒకనాడు వాళ్లందరూ అట్లతద్ది పూజకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందరూ ఉపవాసం ఉన్నారు. కానీ రాజుగారి కూతురు మాత్రం ఆకలితో నీరసించిపోతుంది. ఆమె సోదరుడైన రాజకుమారుడు చెల్లి అవస్థను చూడలేక, అద్దంలో ఒక తెల్లని వస్తువును చూపించి.. […] The post అట్లతద్దోయ్ ఆరట్లోయ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అట్లతద్ది నోము కథ

అట్ల తద్ది నోము నోచుకునే వారు చివరిలో ఈ కథ చుదువుకుంటారు. పూర్వం ఒక రాజ్యంలో రాజు, మంత్రి, సేనాపతి, పురోహితుడు నలుగురికీ నలుగురు కూతుళ్లు ఉండేవారు. వాళ్లు వాళ్లు నలుగురూ ఎంతో స్నేహంగా వుండేవారు. ఒకనాడు వాళ్లందరూ అట్లతద్ది పూజకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందరూ ఉపవాసం ఉన్నారు. కానీ రాజుగారి కూతురు మాత్రం ఆకలితో నీరసించిపోతుంది. ఆమె సోదరుడైన రాజకుమారుడు చెల్లి అవస్థను చూడలేక, అద్దంలో ఒక తెల్లని వస్తువును చూపించి.. చంద్రోదయమైందని చెప్పాడు. రాజుకుమారై అన్న మాటలు నమ్మింది. చంద్రోదయం కాకుండానే ఫలాహారం తిని, పూజచేసింది. కొన్నాళ్ల తరువాత స్నేహితురాళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరికీ చక్కని భర్తలు లభించారు. కానీ రాకుమార్తెకు మాత్రం వచ్చిన సంబంధాలు అన్నీ వెనక్కు వెళ్లగా… చివరకు ఒక ముసలివాడు భర్తగా లభిస్తాడు. దాంతో ఆ రాజకుమార్తె ఎంతగానో దుఃఖిస్తుంది. ఆమె బాధను చూసిన పార్వతీ పరమేశ్వరులు ఆమె ముందు ప్రత్యక్షమై.. ఆశ్వయుజ బహుళ తదియనాడు మళ్లీ నియమ నిష్టలతో అట్లతద్ది నోము నోస్తే నీ భర్త యవ్వనవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారు చెప్పిన విధంగానే రాకుమార్తె నోము నోచి, పూజాక్షతలను భర్త చేతికి ఇచ్చి నమస్కరిస్తుంది. ఆమె పైకి లేచి చూసేసరికి ముసలి భర్త పడుచు వాడిగా మారిపోయి ఉంటాడు.

‘అట్లతద్దె ఆరట్లు.. ముద్దపప్పు మూడట్లు’ అంటూ ఆడ పడుచులకు బంధువులకు, ఇరుగు పొరుగులకు వాయినాలివ్వడం పరిపాటి. సాయం సమయంలో వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసి, గో పూజకు వెళ్లి, అటు నుంచి చెరువులు, కాలువల్లో దీపాలను వదలి, చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఏటా జరుపుకునే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైంది. ఆశ్వయుజ మాసంలో విజయ

దశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. అయిదేళ్లు దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు ఈ పండుగను చేసుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.

కథ: త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం. ఇందులో చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్న శక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రసాదానికి ప్రత్యేకత: అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది.

మినపప్పు, బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావం రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇస్తారు.
పూజా విధానం: అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని ఇల్లంతా శుద్ధిచేసుకుని, ఉపవాసం ఉండి, ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యంగాపెట్టి, ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పించాలి. తర్వాత అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనం చేయాలి.

 

Atla Taddi Nomu vidhanam in telugu

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అట్లతద్దోయ్ ఆరట్లోయ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.