దేశీయ ఆయుధాలతోనే యుద్ధం గెలుస్తాం

  భవిష్యత్తులో అన్నీ పరోక్ష యుద్ధాలే అందుకనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి డిఆర్‌డిఓ సదస్సులో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పిలుపు న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. భారత దేశం తన తదుపరి యుద్ధాన్ని దేశీయ పరిష్కారాలతోనే పోరాడి విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు యుద్ధ తంత్రాలను దృష్టిలో పెట్టుకుని మన ఆయుధాలను, ఇతర […] The post దేశీయ ఆయుధాలతోనే యుద్ధం గెలుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భవిష్యత్తులో అన్నీ పరోక్ష యుద్ధాలే
అందుకనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి
డిఆర్‌డిఓ సదస్సులో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పిలుపు

న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. భారత దేశం తన తదుపరి యుద్ధాన్ని దేశీయ పరిష్కారాలతోనే పోరాడి విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు యుద్ధ తంత్రాలను దృష్టిలో పెట్టుకుని మన ఆయుధాలను, ఇతర సిస్టమ్‌లను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందని మంగళవారం ఇక్కడ డిఆర్‌డిఓ డైరెక్టర్ల 41వ సమావేశంలో మాట్లాడుతూ రావత్ అన్నారు. ‘భవిష్యత్తులో యుద్ధాలు పరస్పరం ఎదురెదురుగా తలపడడం ఉండదు. పరోక్ష యుద్ధాలే ఉంటాయి. అందువల ్లకృత్రిమ మేధోసంపత్తి(ఎఐ)తో పాటుగా సైబర్‌స్పేస్, రోదసి, లేజర్, ఎలక్ట్రానిక్ , రోబోటిక్ యుద్ధాలను అభివృద్ధి చేసుకోవడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

వాటిని ఇప్పుడే మనం అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించకపోతేచాలా ఆలస్యం అయిపోతుంది’ అని రావత్ అన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో డిఆర్‌డిఓ సాధించిన విజయాలకుగాను ఆయన అభినందిస్తూ, దానిద్వారా సైన్యం ఎంతో లాభపడుతుందని తమకు గట్టి నమ్మకం ఉందని అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా భారత దేశం పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు దిగుమతి చేసుకుంటూ ఉంది. ఆదేమీ గర్వంగా చెప్పుకుంటున్నది కాదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మారుతోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన పరిష్కారాలతో త్రివిధ దళాల అవసరాలను తీర్చడానికి దిఆర్‌డిఓ నిర్విరామంగా కృషి చేస్తోంది’ అని రావత్ అన్నారు.‘ భారత్ తన తదుపరి యుద్ధాన్ని దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలతోనే విజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకం మాకు ఉంది’ అని రావత్ చెప్పారు.

డిఆర్‌డిఓ భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ప్రారంభ సెషన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వాయుసేన చీఫ్ ఆర్‌కెఎస్ భదూరియా, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్, డిఆర్‌డిఓ చీఫ్ జి సతీష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఈ రోజు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ 88వ జయంతి కూడా అయినందున డిఆర్‌డిఓలో ఉన్న ఆయన విగ్రహానికి రాజ్‌నాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. శాస్త్రీయాభివృద్ధి ద్వారా భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న ఆయన కలను సాకారం చేసే దిశగా మనమంతా కృషి చేయాలని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.

We will win the war with Domestic Weapons

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశీయ ఆయుధాలతోనే యుద్ధం గెలుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: