లిఫ్ట్ సాకుతో బాలిక కిడ్నాప్

 కత్తితో బెదిరించి కారులో 36 గంటలు తిప్పిన కిడ్నాపర్లు  జిపిఎస్ ట్రాకింగ్‌తో కారు జాడ కనుగొన్న పోలీసులు  ఇద్దరు యువకుల అరెస్ట్, రిమాండ్ మన తెలంగాణ/గోషామహల్: ఓ మైనర్ బాలికకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి కారులో ఎక్కించుకుని కత్తితో బెదిరించి 36 గంటలు తిప్పిన ఇద్దరు యువకు లను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…దుబాయ్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఓ మైనర్ బాలిక (17) ఈ యేడాది […] The post లిఫ్ట్ సాకుతో బాలిక కిడ్నాప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 కత్తితో బెదిరించి కారులో 36 గంటలు తిప్పిన కిడ్నాపర్లు
 జిపిఎస్ ట్రాకింగ్‌తో కారు జాడ కనుగొన్న పోలీసులు
 ఇద్దరు యువకుల అరెస్ట్, రిమాండ్

మన తెలంగాణ/గోషామహల్: ఓ మైనర్ బాలికకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి కారులో ఎక్కించుకుని కత్తితో బెదిరించి 36 గంటలు తిప్పిన ఇద్దరు యువకు లను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…దుబాయ్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఓ మైనర్ బాలిక (17) ఈ యేడాది ఆగస్టులో నగరానికి వచ్చి, సైదాబాద్‌లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఇటీవలే అబిడ్స్ చాపెల్‌రోడ్డులోని సుజాత డిగ్రీ కాలేజీలో బీకామ్‌లో చేరిన మైనర్ బాలిక ఈ నెల 10వ తేదీన కాలేజీకి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం నిరీక్షిస్తూ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ వద్ద నిల్చుంది. నిజామాబాద్‌లోని కారును అద్దెకు తీసుకుని నగరానికి వచ్చి న బహదూర్ పురాకు చెందిన మహ్మద్ అర్పాజుద్దీన్(24) ఆటో కోసం నిరీక్షిస్తున్న మైనర్ బాలిక వద్దకు వచ్చి లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత అర్పాజుద్దీన్ తన వద్ద గల కత్తితో కారు దిగొద్దని, అరవొద్దని, కారు దిగినా, అరిచినా చంపేస్తానని మైనర్ బాలికను బెదిరించారు. రాత్రి వరకు కారును నగరంలో తిప్పిన అర్పాజుద్దీన్ మైనర్‌బాలికను నిజామాబాద్‌కు తీసుకెళ్లాడు.

ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకే ఇంటికి చేరుకునే కూతురు రాత్రయినా ఇంటికి రాక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌బాలికను కారులో నిజామాబాద్‌కు తీసుకువెళ్లిన అర్పాజుద్దీన్ 11వ తేదీన నగరానికి వచ్చి మెహిదీపట్నంలో నివసించే స్నేహితుడు సయ్యద్ జుబేర్(21)ను కారులో ఎక్కించుకున్నాడు. అదేరోజు రాత్రి మెదక్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కారును నిలిపారు. బాధుతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన అబిడ్స్ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా కారు నెంబర్ గుర్తించి, కారును అద్దెకు ఇచ్చిన యజ మాని జీపీఎస్ ట్రాక్ ద్వారా కారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్న నిజామాబాద్ పోలీసులతో కారులో అర్పాజుద్దీన్, సయ్యద్ జుబేర్‌లతో పాటు మైనర్ బాలిక ఉండటం గుర్తించి, అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు అక్కడికి చేరుకుని, అర్పాజుద్దీన్, సయ్యద్ జుబేర్‌లను అరెస్ట్ చేసి, బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Abids Police Arrest Kidnappers At Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లిఫ్ట్ సాకుతో బాలిక కిడ్నాప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: