సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తానని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలకు ఆదా యం అధికంగా వస్తుందన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో 263 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం […] The post సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తానని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలకు ఆదా యం అధికంగా వస్తుందన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో 263 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలను అమ్ముకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించి రైతు ఫోన్ నెంబర్‌తో పాటు గ్రామము, పండించిన ధాన్యం వివరాలను యాప్‌లో పొందుపరచాలని బాలవికాస ప్రతినిధులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, డిఆర్‌ఓ చంద్రశేఖర్, పశువైద్య, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రాంజీ,ఏఎంసీ సెక్రెటరీ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి,కోల రమేశ్ గౌడ్, ఉమ, బాలవికాస ప్రతినిధి తిరుపతి రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Supporting To Organic farming Farmers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.