అజేయ భారతం

మన తెలంగాణ/క్రీడా విభాగం: టెస్టు క్రికెట్‌లో తనకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. స్వదేశంలో రికార్డు స్థాయిలో వరుసగా పదకొండూ సిరీస్‌లు గెలిచి భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో విరాట్ సేన ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక టెస్టు మిగిలివుండగానే 20తో సొంతం చేసుకుంది. విరాట్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత […] The post అజేయ భారతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/క్రీడా విభాగం: టెస్టు క్రికెట్‌లో తనకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. స్వదేశంలో రికార్డు స్థాయిలో వరుసగా పదకొండూ సిరీస్‌లు గెలిచి భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో విరాట్ సేన ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక టెస్టు మిగిలివుండగానే 20తో సొంతం చేసుకుంది. విరాట్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టెస్టుల్లో భారత్ మరింత బలోపేతమైన జట్టుగా మారింది. తాజాగా సౌతాఫ్రికా వంటి బలమైన జట్టుపై రెండు వరుస విజయాలు సాధించడంతో టీమిండియా ఎదురులేని శక్తిగా మారుతుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటికే వెస్టిండీస్‌ను వారి సొంత గడ్డపై చిత్తు చిత్తుగా ఓడించిన తాజాగా సొంత గడ్డపై పటిష్టమైన సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో జయకేతనం ఎగుర వేసింది. ఇక, రాంచీలో జరిగే మూడో టెస్టులో కూడా గెలిచి సిరీస్‌ను క్లీస్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. రెండు జట్ల మధ్య శనివారం నుంచి ఆఖరి టెస్టు జరుగనుంది. ఇందులో కూడా గెలిచి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో కోహ్లి సేన ఉంది. ఇక, తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్ పుణెలోనే అదే జోరును కొనసాగించింది.

ఈసారి విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. మయాంక్ అగర్వాల్ కూడా వరుసగా రెండో సెంచరీతో తనవంతు సహకారం అందించాడు. సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రవీంద్ర జడేజాలు నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. రోహిత్ శర్మ విఫలమైనా మిగతావారు రాణించడంతో జట్టుకు పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. ఈ సిరీస్ ద్వారా మయాంక్ అగర్వాల్ రూపంలో భారత్‌కు మంచి ఓపెనర్ దొరికాడనే చెప్పాలి. రెండు మ్యాచుల్లోనూ మయాంక్ అద్భుతంగా రాణించాడు. విశాఖలో డబుల్ సెంచరీతో ప్రకంపనలు సృష్టించాడు. ఇక, పుణెలో కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండు టెస్టుల్లో కూడా అతని బ్యాటింగ్ చూడముచ్చటగా సాగింది. ఇదే జోరును కొనసాగిస్తే టెస్టుల్లో ఓపెనింగ్ సమస్యం తీరినట్టేనని చెప్పాలి. రోహిత్ శర్మ కూడా చివరి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. అతను విజృంభిస్తే భారత్‌కు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం కష్టమేమి కాదు.
నంబర్‌వన్‌పై కోహ్లి గురి
ఇక, పుణెలో అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కిన కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. రాంచీలో జరిగే ఆఖరి టెస్టులో రాణించడం ద్వారా తిరిగి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లికి ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ ర్యాంక్‌ను అందుకోవడం కష్టమేమి కాదనే చెప్పాలి. అతను విజృంభిస్తే జట్టుకు తిరుగే ఉండదు. ఈ విషయం ఇప్పటికే పుణె టెస్టులో స్పష్టమైంది. కోహ్లి రాంచీలో కూడా సత్తా చాటాలనే లక్షంతో ఉన్నాడు. ఇక, ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి నుంచి సౌతాఫ్రికాకు పెద్ద ప్రమాదమే పొంచి ఉందని చెప్పక తప్పదు. కోహ్లి చెలరేగితే భారీ స్కోరు చేయకుండా భారత్‌ను ఆపడం చాలా కష్టమనే విషయం దక్షిణాఫ్రికాకు ఇప్పటికే అర్థమైంది. కోహ్లితో పాటు మయాంక్, రోహిత్‌లు రాణిస్తే సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇటు బౌలర్లు కూడా జోరుమీదున్నారు. స్పీడ్‌స్టర్లు ఇషాంత్, ఉమేశ్, షమిలు కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇక రవీంద్ర జడేజా, అశ్విన్‌లకు తిరగే లేకుండా పోయింది. ఒక ఇన్నింగ్స్‌లో అశ్విన్ రాణిస్తే మరోదాంట్లో జడేజా చెలరేగుతున్నాడు. దీంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు రెండు టెస్టుల్లోనూ కష్టాలు తప్పలేదు. ఇక, రాంచీలో కూడా సత్తా చాటాలనే లక్షంతో భారత బౌలర్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సౌతాఫ్రికాకు మరో ఓటమి ఎదురైనా ఆశ్చర్యం లేదు.

Team India Won Continuously 11 Series In India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అజేయ భారతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: