ఈ పేగు బంధం అపురూపం

  అమ్మా అని బిడ్డ అరిస్తే తల్లి పేగు కదిలింది అని చదువుతూ ఉంటాం. జీర్ణ వ్యవస్థలో భాగం అయిన పేగుకు, తల్లి భావోద్వేగానికి సంబంధం ఏమిటి? తల్లికి పిల్లలతో ఉండే పేగు బంధం ఏమిటి? ప్రతి మనిషి ఈ ప్రపంచంలోకి రాక ముందు, తొమ్మిది నెలలు తల్లి కడుపులోనే ఉంటాడు. ఈ తొమ్మిది నెలల కాలంలోనే జీవక్రియలన్నీ ప్రారంభం అవుతాయి. శ్వాసక్రియ, జీర్ణాశయం, ఆహారం అందుకోవటం ఇలాంటి వన్నీ తల్లి కడుపులో కదలకుండా పడుకున్నవేళనే నడుస్తాయి. […] The post ఈ పేగు బంధం అపురూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమ్మా అని బిడ్డ అరిస్తే తల్లి పేగు కదిలింది అని చదువుతూ ఉంటాం. జీర్ణ వ్యవస్థలో భాగం అయిన పేగుకు, తల్లి భావోద్వేగానికి సంబంధం ఏమిటి? తల్లికి పిల్లలతో ఉండే పేగు బంధం ఏమిటి? ప్రతి మనిషి ఈ ప్రపంచంలోకి రాక ముందు, తొమ్మిది నెలలు తల్లి కడుపులోనే ఉంటాడు. ఈ తొమ్మిది నెలల కాలంలోనే జీవక్రియలన్నీ ప్రారంభం అవుతాయి. శ్వాసక్రియ, జీర్ణాశయం, ఆహారం అందుకోవటం ఇలాంటి వన్నీ తల్లి కడుపులో కదలకుండా పడుకున్నవేళనే నడుస్తాయి. ఏ ఇబ్బంది లేకుండా గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందుతుంది. ఇందుకు సహకరించే దాన్ని ( అంబెల్లికల్ కార్డ్) పేగు జరాయువు (ప్లాసెంటా) అంటారు.

తల్లి కడుపులో 9 నెలలు గడిచాక ఆ పేగుబంధం తెంచుకుని బిడ్డ బయటకి వస్తుంది. మెలితిరిగిన పేగులా ఉన్న భాగంతో సహా బయటకి వచ్చిన శిశువు పేగు చివర ఒక భాగం కత్తిరించగా, మిగిలిన భాగం బొడ్డుగా శరీరంపైన కనిపిస్తూ ఉంటుంది. తల్లితో తెంచుకునే పేగుకు అవతల భాగం ప్లాసెంటా గర్భాశయ గోడకు అతుక్కుని ఉంటుంది. ఈ ప్లాసెంటా గురించి సరైన అవగాహన, ఆలోచన, ఎవ్వరికి ఉండదు. ఈ ప్లాసెంటా పరిశోధనా ప్రాజెక్టు 2014లో ప్రారంభించారు. ఫలదీకరణం అయ్యాక అండం గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుంటుంది. ఆ అండం నుంచి వేళ్ల వంటివి తల్లి గర్భాశయ గోడల లోకి పెరుగుతాయి. వీటిని తల్లిగర్భాశయ గోడ పెరగనిస్తుంది.

అలా తల్లిని బిడ్డను కలుపుతూ ఏర్పాటైన వేదిక ప్లాసెంటా అలా ప్లాసెంటా ఏర్పడిన తర్వాత పిండం ఎదుగుతుంది. తల్లి నుంచి పోషక పదార్థాలు గ్రహిస్తుంది. తల్లి రక్తంతో సంబంధం ఉన్న ఈ రక్తనాళాలు ఎదుగుతాయి. ఇన్ అంబెల్లికల్ కార్డ్ (పేగు) అవుతుంది. బిడ్డ పెరుగుదలకు కావలసిన విధులన్నీ ప్లాసెంటా ద్వారానే జరుగుతాయి.  ఈ మధ్య కాలంలో ఈ పేగును గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. గర్భాశయంలో ప్లాసెంటా ఏర్పడే తీరు, దాని పనితీరు చాలా ముఖ్యం. ప్రసవించిన వెంటనే ప్లాసెంటాని సేకరించి దాన్ని అవయవం చేసి ఆ సమయంలో బిడ్డ ఆరోగ్య స్థితి ఎదుగుదల వివరాల్ని సేకరించి, పిల్లల ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నారు.

దీనిపైన జరిగిన అధ్యయనంలో ఒక జీవి శరీరంలోని అద్భుతాలు కనుక్కోగలిగారు అధ్యయనకారులు. వాస్తవంతో ఏ జీవి తన లోపలకి ఏ కణాలను రానివ్వరు. అది బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా వెంటనే దాన్ని వెంటాడి వేటాడే వవస్థ శరీరంలో ఉంటుంది. కానీ ఫలదీకరణం జరిగిన అండంతో సగం పురుషుడివి అయినా ప్లాసెంటా ఏర్పాటుకు అడ్డుకాదు. ఈ సమయంలో గర్భాశయంలో జరిగే మార్పులు సంహారిక కణాలు పట్టించుకోవు. ఆ మార్పుకు కారణం తెలుసుకోగలిగితే గర్భస్రావాలు నిరోధించవచ్చు అంటారు పరిశోధకులు.

అందుకే ప్లాసెంటా పైన పరిశోధనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పేగు దానిలోని రక్తం సేకరించి భద్రపరుస్తున్నారు. పేగు, రక్తం, రక్త మూల కణాలని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా రక్త సమస్యలు ఏర్పడితే ఈ మూల కణాల ద్వారా మంచి చికిత్స అందించవచ్చు. ఇప్పుడు ఆల్ట్రాసేంక్ ప్రక్రియ ద్వారా ప్లాసెంటా పరిమాణం తల్లి నుంచి శిశువు రక్త ప్రసరణ ఒత్తిడి పేగు ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకుంటున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు బొడ్డుతాడును భద్రం చేసుకుంటున్నారు.

స్టెమ్ సెల్స్ అనేవి శరీరంలోని ఏదైనా కణజాలం, అవయవంగా రూపాంతరం చెందేందుకు ఉపయోగపడే శక్తివంతమైన ప్రత్యేక కణాలు ఎన్నో రోగాల చికిత్సలకు ఇవి పనికి వస్తా యి. బొడ్డు తాడులో ఉండే విలువైన మూల కణాలతో దెబ్బతిన్న శరీర భాగాలు బాగు చేయవచ్చని పరిశోధనలు చెబుతు న్నాయి. మూల కణాలు ఆయా శరీర భాగాలలో ప్రవేశ పెడితే అక్కడ కొత్త కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయి. ఒకసారి స్టెమ్ సెల్స్‌ని దాచుకుంటే షుగర్, బిపీ, క్యాన్సర్ నుంచి వయస్సు పెరిగాక వచ్చే ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. ఈ స్టెమ్‌సెల్స్ 200 రకాల టిష్యూలను పునరుత్పత్తి చేయగల సామర్థంతో ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో బిడ్డ పుట్టగానే బొడ్డు తాడు భద్రపరిచే బ్యాంక్‌లు వచ్చాయి. దీని గురించి అవగాహన కూడా బాగా పెరుగుతుంది కూడా!

Intestinal bond between Mother and Baby is Amazing

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈ పేగు బంధం అపురూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: