వైకల్యాన్ని జయించిన ప్రంజల్

  జీవితంలో ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం ఒక అడ్డు కానే కాదని ఎందరో వ్యక్తులు నిరూపించారు. చిత్రాలు గీస్తూ.. పరుగులు తీస్తూ.. తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఎన్నో అవమానాలను దిగమింగుకుని, తన అంధత్వాన్ని కూడా అధిగమించి ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించింది ఓ యువతి. ఆమే ప్రంజల్ పాటిల్. దేశంలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిణిగా రికార్డు సృష్టించింది. “ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. చాలా మంది అంధురాలివంటూ నిరుత్సాహపరిచేవారు. దీంతో నాలో పట్టుదల మరింత […] The post వైకల్యాన్ని జయించిన ప్రంజల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జీవితంలో ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం ఒక అడ్డు కానే కాదని ఎందరో వ్యక్తులు నిరూపించారు. చిత్రాలు గీస్తూ.. పరుగులు తీస్తూ.. తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఎన్నో అవమానాలను దిగమింగుకుని, తన అంధత్వాన్ని కూడా అధిగమించి ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించింది ఓ యువతి. ఆమే ప్రంజల్ పాటిల్. దేశంలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిణిగా రికార్డు సృష్టించింది.

“ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. చాలా మంది అంధురాలివంటూ నిరుత్సాహపరిచేవారు. దీంతో నాలో పట్టుదల మరింత పెరిగింది. ఏనాడు వెనుకడుగు వేయలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది”. అంటూ గర్వంగా చెబుతోంది ప్రంజల్ పాటిల్. అంధురాలైన తొలి ఐఏఎస్ ఆఫీసర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించింది ప్రజంల్‌పాటిల్.

మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్‌కు చెందిన ప్రంజల్ అధిక జ్వరంతో బాధపడుతూ తన 6వ ఏట చూపు కోల్పోయింది. బిడ్డ చూపు కోల్పోయిందని తల్లిదండ్రులు బాధపడ్డా పెంపకంలో ఆమెకు ఆ విషయమే మరిచిపోయేలా చేశారు. ఎప్పుడూ నిరుత్సాహపడవద్దని ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అమ్మానాన్నల ప్రోత్సాహం.. తన కష్టం కలగలిసి ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రంజల పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. జేఎన్‌యూలో అంతర్జాతీయ వ్యవహారాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2016లో తొలిసారి యూపీఎస్సీ రాసి 733వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుతో ఆమెకు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది.

“ కళున్న వాళ్లకే కష్టం. అలాంటిది ఈ పోస్ట్‌కి మీరెలా అర్హులవుతారు. మీ పోస్టింగ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. మీకు తగిన మరేదైనా ఉద్యోగం చూసుకోండి” అంటూ అవమానించి పంపేవారు. అయితే అంధురాలన్న కారణంతో ఇచ్చిన పోస్టును రద్దు చేశారు. ఆ బాధను దిగమింగుకుని ఈ సారి మరింత పట్టుదలగా యూపీఎస్సీ పరీక్షలు రాసింది ప్రంజల్. 124వ ర్యాంకు వచ్చి ఐఏఎస్‌గా ఎంపికై, ఏడాది శిక్షణలో భాగంగా కేరళలోని ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసింది. ఈ క్రమంలోనే తిరువనంతపురం డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. దేశంలోనే మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రంజల్ రికార్డు సృష్టించింది. పురుషులలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ ఆఫీసర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారీ రికార్డులకెక్కారు.

“చిన్నతనంలో తనకు చూపు పోయిన తర్వాత తన కంటికి ఎన్నో సార్లు సర్జరీలు జరిగాయని.. ఆ సమయంలో ఎంతో బాధగా ఉండేది. ఎన్ని సర్జరీలు జరిగినా అన్నీ విఫలమయ్యాయంటూ” గతాన్ని గుర్తుచేసుకుంది. నా ఎదుగుదలకు కారణం నా తల్లిదండ్రులే. వారి వల్లే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కలలను సాకార చేసుకున్నానంటోంది ప్రంజల్.

Pranjal who conquered Disability

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వైకల్యాన్ని జయించిన ప్రంజల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: