అందచందాల పట్ల ప్రత్యేక శ్రద్ధ

  ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు,- తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నయనతార ఆ తర్వాత రెండు భాషల్లోని అగ్ర హీరోలందరితోనూ నటించి మెప్పించింది. మొదట్లో కొంచెం బొద్దుగా ఉన్న ఈ అమ్మడు రాను రాను జీరో సైజుకి మారి మరింత నాజూకుగా తయారైంది. అటు సీనియర్ హీరోలతో ఇటు యువ హీరోలతోనూ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఈ బ్యూటీ. 34 సంవత్సరాల నయనతారకి ఈ మధ్య వయసు పెరగడంతో తన అందం తగ్గుతుందనే బెంగ […] The post అందచందాల పట్ల ప్రత్యేక శ్రద్ధ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు,- తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నయనతార ఆ తర్వాత రెండు భాషల్లోని అగ్ర హీరోలందరితోనూ నటించి మెప్పించింది. మొదట్లో కొంచెం బొద్దుగా ఉన్న ఈ అమ్మడు రాను రాను జీరో సైజుకి మారి మరింత నాజూకుగా తయారైంది. అటు సీనియర్ హీరోలతో ఇటు యువ హీరోలతోనూ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఈ బ్యూటీ. 34 సంవత్సరాల నయనతారకి ఈ మధ్య వయసు పెరగడంతో తన అందం తగ్గుతుందనే బెంగ పట్టుకుంది. జిమ్, – యోగాలతో ఎంత కష్టపడినా ప్రయోజనం కనపడకపోవడంతో కేరళలో మాత్రమే దీనికి పరిష్కారం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. షూటింగ్‌లకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని కేరళలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది.

తనకంటే వయసులో ఒక సంవత్సరం చిన్నవాడైన దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీళ్లిద్దరూ తమ ప్రేమ సంగతి ఎక్కడా బయటపెట్టలేదు. విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఆమె మొదటిసారిగా ‘నానుమ్ రౌడీ’ అనే తమిళ సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా పబ్లిక్ ఫంక్షన్స్‌కు కూడా వీళ్లిద్దరూ కలిసే హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం జరిగిన విఘ్నేష్ బర్త్ డే ఫంక్షన్‌లో నయనతార హడావుడి మాములుగా లేదు. ఇంత జరిగినా వీళ్ల ప్రేమ గురించి మాత్రం బయటకి చెప్పట్లేదు.

Nayanthara is being treated in Kerala for beauty

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అందచందాల పట్ల ప్రత్యేక శ్రద్ధ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: