ముస్తాబవుతున్న ‘తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్’

  సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ […] The post ముస్తాబవుతున్న ‘తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.

సాయి కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: టి.రాజసింహ, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్, స్క్రీన్‌ప్లే: రాజు, గోపాలకృష్ణ, ఆర్ట్: కిరణ్, యాక్షన్: వెంకట్.

Tenali Ramakrishna BA BL movie shooting compleated

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముస్తాబవుతున్న ‘తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: