వాస్తవ ఘటనల ఆధారంగా

  సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అధిరన్’కు తెలుగు అనువాద చిత్రమిది. నవంబర్ 15న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “కేరళలో 1970వ దశకంలో జరిగిన […] The post వాస్తవ ఘటనల ఆధారంగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అధిరన్’కు తెలుగు అనువాద చిత్రమిది. నవంబర్ 15న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “కేరళలో 1970వ దశకంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు” అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్: అయూబ్ ఖాన్, కెమెరా: అను మోతేదత్, స్క్రీన్‌ప్లే: పి.ఎఫ్.మాథ్యూస్.

Anukoni Athidi movie Based on Actual Events

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాస్తవ ఘటనల ఆధారంగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: