అరిటాకులో ఎంచక్కా…

పర్యావరణానికి హితాన్ని కలిగించేవే పూర్వపు పద్ధతులన్నీ. అరటి ఆకుల్లో భోజనం సంప్రదాయంతోపాటు ఆరోగ్యానికి ఎంతో లాభం కలిగించేది. పూర్వం బంతి భోజనాలంటే అతిథులను పీట వేసి కూర్చోబెట్టి అరటి ఆకుల్లో కొసరి కొసరి వడ్డించేవారు. వారు తృప్తిగా భోజనం చేసేవరకు వదిలేవారు కాదు. చివరగా తాంబూలంతో సంతృప్తి పరిచేవారు. రోజులు మారాయి… బఫే వచ్చింది. బరువైన ప్లేటులను పట్టుకుని కూర్చోవడానికి స్థలం లేక, పళ్లాని,్న దాంట్లోని పదార్థాలను మోయలేక, మధ్యలో దాహమైతే ఈ పళ్లాన్ని ఎక్కడ పెట్టాలో […] The post అరిటాకులో ఎంచక్కా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పర్యావరణానికి హితాన్ని కలిగించేవే పూర్వపు పద్ధతులన్నీ. అరటి ఆకుల్లో భోజనం సంప్రదాయంతోపాటు ఆరోగ్యానికి ఎంతో లాభం కలిగించేది. పూర్వం బంతి భోజనాలంటే అతిథులను పీట వేసి కూర్చోబెట్టి అరటి ఆకుల్లో కొసరి కొసరి వడ్డించేవారు. వారు తృప్తిగా భోజనం చేసేవరకు వదిలేవారు కాదు. చివరగా తాంబూలంతో సంతృప్తి పరిచేవారు. రోజులు మారాయి… బఫే వచ్చింది. బరువైన ప్లేటులను పట్టుకుని కూర్చోవడానికి స్థలం లేక, పళ్లాని,్న దాంట్లోని పదార్థాలను మోయలేక, మధ్యలో దాహమైతే ఈ పళ్లాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక…తినాలంటే తిప్పలే. విస్తరాకులా డిజైన్ చేసిన ప్లాస్టిక్ ఆకు, ప్లాస్టిక్ గ్లాసు, చెంచాలు, గిన్నెలు, సీసాలు…ఇలా వాడేవన్నీ పర్యావరణాకి హాని కలిగించేవే.

ఇవి రీసైక్లింగ్‌కి కూడా పనికిరావు. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న దుష్పభావాల్ని అనుభవిస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు చెక్ పెట్టే సమయం వచ్చింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పాత పద్ధతుల్ని అనుసరిద్దాం…అరిటాకుల్లో తినడమే కాకుం డా ఇలా కూడా ఉపయోగించ వచ్చని ఈ ఫొటోలను చూస్తుంటే తెలుస్తోంది కదూ! ప్లాస్టిక్‌కి బదులుగా అరిటాకులతో ఎంత చక్కగా చేశారో చూడండి. ఈ ఆలోచనను మెచ్చుకుని ఆచరణలో పెట్టేద్దాం..

Lunch on a banana leaf

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అరిటాకులో ఎంచక్కా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.