రాజీవ్ ను అందుకే చంపాం …

చెన్నయ్ : భారత దళాలను శ్రీలంకకు పంపి అక్కడి తమిళియన్స్ ను ఊచకోత కోయించినందుకే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చినట్టు నామ్ తమిళర్ కట్చి (ఎన్ టికె) అధ్యక్షుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమాన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఎల్ టిటిఇకి సీమాన్ సానుభూతిపరుడు అన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరిలోని కామరాజనగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో సీమాన్ […] The post రాజీవ్ ను అందుకే చంపాం … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : భారత దళాలను శ్రీలంకకు పంపి అక్కడి తమిళియన్స్ ను ఊచకోత కోయించినందుకే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చినట్టు నామ్ తమిళర్ కట్చి (ఎన్ టికె) అధ్యక్షుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమాన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఎల్ టిటిఇకి సీమాన్ సానుభూతిపరుడు అన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరిలోని కామరాజనగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో సీమాన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ పైవిధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందం పేరుతో శ్రీలంకతో రాజీవ్ గాంధీ రాయబారం నడపడం వల్లనే ఆయనను తమిళగడ్డపైనే హతమార్చామని సీమాన్ అన్నారు. రాజీవ్ గాంధీపై సీమాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో సీమాన్ ఆఫీసు, ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రాజీవ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు సీమాన్ ను డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యలతో సీమాన్ పై దేశ ద్రోహం కేసు కూడా నమోదైంది.

NTK Chief Seeman Comments On Ex PM Rajiv Gandhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజీవ్ ను అందుకే చంపాం … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: