చిన్నారిపై ఎయిడ్స్ రోగి అత్యాచారం

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిడ్స్ రోగి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.  పట్టణానికి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో టివి చూసేందుకు సదరు లారీ క్లీనర్ తరచూ మహిళ ఇంటికి వచ్చేవాడు. తన ఏడేళ్ల కూతురికి జ్వరం రావడంతో మాత్రలు ఇచ్చి […] The post చిన్నారిపై ఎయిడ్స్ రోగి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిడ్స్ రోగి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.  పట్టణానికి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో టివి చూసేందుకు సదరు లారీ క్లీనర్ తరచూ మహిళ ఇంటికి వచ్చేవాడు. తన ఏడేళ్ల కూతురికి జ్వరం రావడంతో మాత్రలు ఇచ్చి అనంతరం ఆమె కూలీ పనులకు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న చిన్నారిపై లారీ క్లీనర్ అత్యాచారం చేశాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లి కేకలు వేయడంతో లారీ క్లీనర్ పరారయ్యాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో నిందితుడైన లారీ క్లీనర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

AIDS Patient Rape On Girl In Aswaraopeta

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్నారిపై ఎయిడ్స్ రోగి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: