రోడ్లపై 10వేల బస్సులు

నడిచిన 5,375 ఆర్‌టిసి బస్సులు, విధుల్లో 7వేల మంది ప్రైవేటు సిబ్బంది మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వల్ల సోమవారం భారీగా వాహనాలు రోడ్ల పై పరుగులు తీశాయి. సంస్థకు చెందిన బస్సు సర్వీసుల లో అత్యధికంగా బస్సులను యాజమాన్యం నడిపి ంది. ఆర్‌టిసి పరిధిలోని11 రీజియన్ ప్రాంతాల లో అత్యధిక శాతం బస్సు సర్వీసులను నడిపారు. మరో వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేట్ […] The post రోడ్లపై 10వేల బస్సులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నడిచిన 5,375 ఆర్‌టిసి బస్సులు, విధుల్లో 7వేల మంది ప్రైవేటు సిబ్బంది

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వల్ల సోమవారం భారీగా వాహనాలు రోడ్ల పై పరుగులు తీశాయి. సంస్థకు చెందిన బస్సు సర్వీసుల లో అత్యధికంగా బస్సులను యాజమాన్యం నడిపి ంది. ఆర్‌టిసి పరిధిలోని11 రీజియన్ ప్రాంతాల లో అత్యధిక శాతం బస్సు సర్వీసులను నడిపారు. మరో వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు దాదాపు 5వే ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. దిన దినంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విస్తృతంగా పెరగడంతో పాటు ఆర్‌టిసి సంస్థకు చేందిన బస్సులను సహితం విస్తృతంగా నడిపేందుకు యాజమాన్యం ఉద్యోగుల నియామకాలను చేపట్టారు. తద్వారా యాజమాన్యం ఆశించిన మేర ఫలితాలను సాధిస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. సోమవారం ఒక్క రోజు స్వతహాగా ఆర్‌టిసి సంస్థకు చేందిన5,375 బస్సులతో 4,514 అన్ని రకాల వాహనాలు నడిపారని తెలిపారు.

సమ్మె సందర్భంగా ప్రయాణికుల రవాణా అవసరాలను తీర్చేందుకు గాను గత 10 రోజులుగా ఆర్‌టిసి, ఆర్‌టిఏ సంయుక్తాధ్వర్యంలో పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ రవాణా వ్యస్థలను ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ డ్రైవర్‌లు 3,557 మంది, ప్రైవేట్ కండక్టర్‌లు 3,557 మంది విధులను నిర్వహించారు. సమ్మె ప్రారంభమైన రోజు నుంచి దరసరా పండుగ వరకు ప్రయణికుల రద్దీ మేరకు విస్తృతంగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికుల రద్దీ మేరకు ఆయా రిజియన్‌ల పరిధిలో సమర్ధవంతమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ద్వారా ప్రయాణికులు సాఫిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికులకు టికెట్లు జారీ చేయు దిశగా ప్రత్యామ్నాయాలను వేగిరం చేశారు. ఇందుకు గాను యాజమాన్యం టిమ్స్ పరికరాలను సిద్ధం చేయాలని సరఫరాదారుకు అదేశాలను జారీ చేసింది. మరో వైపు తాత్కాలిక నియామకాలు సహితం హోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సౌకర్యమైన రవాణా ఏర్పాటు కావడం ద్వారా వారి గమ్యస్థానాలకు సులభంగా చేరుకుంటున్నారు.

RTC workers strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్లపై 10వేల బస్సులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: