17న హుజూర్‌నగర్‌లో కెసిఆర్ సభ

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హుజూర్‌నగర్ ఎన్నికలప్రచార కార్యక్రమం ఖరారైంది. ఈనెల 17న హుజూర్‌నగర్ లో నిర్వహించనున్న బహిరంగసభలో సిఎంకెసిఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ బహిరంగం సభకు నియోజకవర్గంలోని ప్రతిమండలం నుంచి భారీగా జనం తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈబహిరంగసభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. సిఎం పర్యటన ఖరారు కావడంతో వేడెక్కిన రాజకీయాలు హుజూర్‌నగర్ ఎన్నికలప్రచార భారీ బహిరంగసభకు ముఖ్యమంత్రికెసిఆర్ రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా […] The post 17న హుజూర్‌నగర్‌లో కెసిఆర్ సభ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హుజూర్‌నగర్ ఎన్నికలప్రచార కార్యక్రమం ఖరారైంది. ఈనెల 17న హుజూర్‌నగర్ లో నిర్వహించనున్న బహిరంగసభలో సిఎంకెసిఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ బహిరంగం సభకు నియోజకవర్గంలోని ప్రతిమండలం నుంచి భారీగా జనం తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈబహిరంగసభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.
సిఎం పర్యటన ఖరారు కావడంతో వేడెక్కిన రాజకీయాలు
హుజూర్‌నగర్ ఎన్నికలప్రచార భారీ బహిరంగసభకు ముఖ్యమంత్రికెసిఆర్ రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా హుజూర్‌నగర్ రాజకీయాలు వేడెక్కాయి. టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గెలుపుకోసం ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ భారీ మెజారిటీ సొంతం చేసుకుని కాంగ్రెస్,బిజెపిలకు గుణపాఠం నేర్పాలని టిర్‌ఎస్‌నాయకులు ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి ఎంఎల్‌సి పల్లారాజేశ్వర్ రెడ్డిలతోపాటు నల్గొండ జిల్లా టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధానంగా గిరిజన తండాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు.
గులాబిజెండా ఎగరడం ఖాయం
ప్రజలను అనేకపర్యాయాలు మోసం చేసిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ నిజస్వరూపాన్ని ప్రజలు గమనించారని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్‌గెలిస్తే కేవలం ఆకుటుంబానికే లాభం టిఆర్‌ఎస్ గెలిస్తే నియోజకవర్గానికి లాభమనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవడంతో గ్రామాలకు గ్రామాలు టిఆర్‌ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతూ టిఅర్‌ఎస్ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి హుజూర్‌నగర్‌కు వస్తున్నారనే వార్త తెలియడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తం మవుతుందన్నారు. సిఎం కెసిఆర్‌ను ఎప్పుడు చాడాలనే తపనతో ప్రజలు ఎదిరిచూస్తున్నారని చెప్పారు.

పద్మావతికి ఓటువేస్తే ఉత్తమ్‌కుమార్ రెడ్డి కుటుంబానికే లాభం చేకూరుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కు అభివృద్ధి గుర్తుకు రాలేదన్నారు. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాగ్రెస్ అధికారంలో లేకున్నా ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తమ్ ఆనాడే అభివృద్ధి చేస్తే ఈ సమస్యలు ఉండేవి కాదన్నారు. ఇప్పటికైన ప్రజలు వాస్తవాలను గ్రహించి ఉత్తమ్ రాజకీయ ప్రయోజనాలకోసం చేస్తున్న కపట నాటకాలను గ్రహించి ప్రజలంతా టిఆర్‌ఎస్ పక్షంలోకి రావడం హర్షనీయమన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
బహిరంగసభ ఏర్పాట్లను
పరిశీలించిన టిఆర్‌ఎస్ బృందం
హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనే బహిరంగసభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అలాగే రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లాపరిషత్ ఛైర్మన్ దీపికా యుగంధర్ రావు, శాసనసభ్యులు గాధరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR To Hold Public Meet At Huzurnagar On 17th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 17న హుజూర్‌నగర్‌లో కెసిఆర్ సభ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.