పావురాలతో జాగ్రత

శ్వాససంబంధిత వ్యాధులకు వాటి విసర్జితాలే కారణం త్వరలో ప్రభుత్వానికి నివేదిక మనతెలంగాణ/హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న ప్రాణాంతక నిఫావైరస్ తరహా ఉపద్రవం భవిష్యత్‌లో రాష్ట్రంలో పావురాలతో వచ్చేప్రమాదం ఉందని పావురాలపై అధ్యయనంచేసిన డాక్టర్ వాసుదేవరావు బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. హైదరాబాద్‌లో పావురాలు ఎన్నిఉన్నాయో సమాచారం ప్రభుత్వం దగ్గర లేకున్నా తమబృందం చేసిన అధ్యయనంలో ఆరులక్షల పావురాలు ఉన్నట్లు తెలిసిందని ఆయన ఒకప్రటనలో వివరించారు. హైదరాబాద్‌లో శరవేగంగా పేరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించకుంటే […] The post పావురాలతో జాగ్రత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


శ్వాససంబంధిత వ్యాధులకు వాటి విసర్జితాలే కారణం
త్వరలో ప్రభుత్వానికి నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న ప్రాణాంతక నిఫావైరస్ తరహా ఉపద్రవం భవిష్యత్‌లో రాష్ట్రంలో పావురాలతో వచ్చేప్రమాదం ఉందని పావురాలపై అధ్యయనంచేసిన డాక్టర్ వాసుదేవరావు బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. హైదరాబాద్‌లో పావురాలు ఎన్నిఉన్నాయో సమాచారం ప్రభుత్వం దగ్గర లేకున్నా తమబృందం చేసిన అధ్యయనంలో ఆరులక్షల పావురాలు ఉన్నట్లు తెలిసిందని ఆయన ఒకప్రటనలో వివరించారు. హైదరాబాద్‌లో శరవేగంగా పేరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించకుంటే భవిష్యత్‌లో పావురాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. లండన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పావురాలకు దాణవేయడాన్ని నిషేధించినట్లు తెలిపారు. సింగపూర్‌లో పావురాలను పెంచినా, దాణవేసినా జరినామాలు విధుస్తున్నారని తెలిపారు. కానీ హైదరాబాద్‌లో పావురాలకు విచ్చలవిడిగా దాణావేస్తున్నా పట్టించుకునేవారు లేరని విచారం వ్యక్తం చేశారు.పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరడంతో శ్వాససంబంధించిన వ్యాధులువ్యాపిస్తున్నాయని తెలిపారు.

CareFul with pigeons

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పావురాలతో జాగ్రత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: