కథ, క్యారెక్టర్‌తో పాటు టీం కూడా ముఖ్యమే

  ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న హీరోయిన్ అవికా గోర్ ఇప్పుడు ‘రాజు గారి గది 3’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్‌బాబు హీరోగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అవికాగోర్‌తో ఇంటర్వూ విశేషాలు… అందుకే గ్యాప్… ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు. పైగా రెండు […] The post కథ, క్యారెక్టర్‌తో పాటు టీం కూడా ముఖ్యమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న హీరోయిన్ అవికా గోర్ ఇప్పుడు ‘రాజు గారి గది 3’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్‌బాబు హీరోగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అవికాగోర్‌తో ఇంటర్వూ విశేషాలు…

అందుకే గ్యాప్…
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు. పైగా రెండు టివీషోలు చేయడం వల్ల ఇక్కడ ఫోకస్ పెట్టలేకపోయాను. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది.

హ్యాపీగా ఉంది…
‘రాజు గారి గది 3’లో నేను లీడ్ క్యారెక్టర్ చేయడంతో హ్యాపీగా ఉంది. ఈ క్యారెక్టర్‌ను తమన్నాతో చేయించాలని అనుకున్నామని డేట్స్ కుదర్లేదని ఓంకార్ చెప్పారు. ఇక 40 నిమిషాలు ఆయన నాకు కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమాతో పాటు నా క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

ఆ కిక్కును పొందాను…
ఆలి నటించిన చాలా డబ్బింగ్ సినిమాలు చూశాను. ఎప్పటికైనా ఆయనతో నటించాలని మా అమ్మ అంటుండేది. ఈ సినిమాతో ఆ ఛాన్స్ వచ్చింది. ఆలీ లాంటి సీనియర్ యాక్టర్స్‌తో నటించడం ఓ కిక్కు. ఆ కిక్కును ఈ సినిమాతో పొందాను.

టీం కూడా ముఖ్యమే…
కథ , క్యారెక్టర్‌తో పాటు టీం కూడా నాకు ముఖ్యమే. ముందుగా టీంను దృష్టిలో పెట్టుకునే సినిమా ఒకే చేస్తాను. ఈ సినిమాకు వర్క్ చేసిన టీం అందరూ బెస్ట్ వర్క్ ఇచ్చారు. అందుకే సినిమా తొందరగా పూర్తయింది.

అప్పుడు భయపడ్డాను…
నేను హార్రర్ సినిమాలు చూడను. ఆ జోనర్‌కి కాస్త దూరంగానే ఉంటాను. ఓంకార్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా చాలా భయపడ్డాను. కానీ ఈ సినిమాలో హార్రర్‌తో పాటు బ్రిలియంట్ కామెడీ ఉంది. ఆ కామెడీ సీన్స్ అందరినీ కడపుబ్బ నవ్విస్తాయి.

మరో సినిమాకు సైన్…
తెలుగులో మరో సినిమాకు సైన్ చేశాను. ఆ సినిమా గురించి చెప్పాలనుంది. కానీ మరో 15 రోజుల్లో ఈ సినిమా ప్రకటన వస్తుంది.

Interview with Avika Gor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కథ, క్యారెక్టర్‌తో పాటు టీం కూడా ముఖ్యమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: