సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్…

  సుప్రీం హీరో, మేగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2, యువి పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. సాయి తేజ్ సరసన రెండోసారి రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కుటుంబ బంధాలు, విలువలను ఎమోషనల్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. […] The post సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుప్రీం హీరో, మేగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2, యువి పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. సాయి తేజ్ సరసన రెండోసారి రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కుటుంబ బంధాలు, విలువలను ఎమోషనల్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్‌ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రేపు(అక్టోబర్ 15) సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సత్యరాజ్, విజయ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, సత్యం రాజేష్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

prathi roju pandage movie first Glimpse on Oct 15

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: