హీరో కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్ : ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సినిమా ‘ఖైదీ’. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాలో యావజ్జీవ  శిక్ష పడిన ఖైదీ పాత్రలో కార్తీ నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కూడా ఉన్నట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.  డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. […] The post హీరో కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సినిమా ‘ఖైదీ’. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాలో యావజ్జీవ  శిక్ష పడిన ఖైదీ పాత్రలో కార్తీ నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కూడా ఉన్నట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.  డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండవని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ దీపావళికి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలోనూ, తెలుగులోనూ ‘ఖైదీ’ పేరుతోనే ఈ సినిమా విడుదల కానుంది.

Kollywood Hero Karthi Khaidi Trailer Release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హీరో కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: