దీపిక నడుముపై మనసు పారేసుకున్న వేళ

ముంబై: పెళ్లయినా బాలీవుడ్ నటుడు రణవీర్ కపూర్‌లో ఏమాత్రం మార్పు లేదంటోంది అతని భార్య దీపికా పదుకొణె. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే 2013లో దీపికతో తొలిసారి నటించిన గోలియోంకీ రాస్‌లీలా రామ్-లీలా చిత్రం షూటింగ్ నాటి ఫోటోను ఒకటి రణవీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీపిక వెనుక కూర్చున్న రణవీర్ ఆమె నడుమును తదేకంగా చూస్తున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. దీపిక, రణవీర్ ఇద్దరూ గుజరాతీ సంప్రదాయ వస్తువులు ధరించి ఉండడం ఆ ఫోటోలో […] The post దీపిక నడుముపై మనసు పారేసుకున్న వేళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: పెళ్లయినా బాలీవుడ్ నటుడు రణవీర్ కపూర్‌లో ఏమాత్రం మార్పు లేదంటోంది అతని భార్య దీపికా పదుకొణె. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే 2013లో దీపికతో తొలిసారి నటించిన గోలియోంకీ రాస్‌లీలా రామ్-లీలా చిత్రం షూటింగ్ నాటి ఫోటోను ఒకటి రణవీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీపిక వెనుక కూర్చున్న రణవీర్ ఆమె నడుమును తదేకంగా చూస్తున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. దీపిక, రణవీర్ ఇద్దరూ గుజరాతీ సంప్రదాయ వస్తువులు ధరించి ఉండడం ఆ ఫోటోలో చూడవచ్చు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రణవీర్ దీనికి క్యాప్షన్ అవసరం లేదు అని రాశాడు. దీనికి దీపిక కూడా వెంటనే ఇలా స్పందించింది. ఏడేళ్లయినా ఏమీ మారలేదు..నా మీద నీ కళ్లు..నీమీద నా కళ్లు అంటూ జవాబిచ్చింది. ఈ కామెంట్లపై బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. పరిణీతి చోప్రా, హుమా ఖురేషి, ఆయుష్మాన్ ఖురానా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరుల నుంచి నవ్వే సమాధానమైంది. కాగా, సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే దీపిక, రణవీర్ మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ కలసి తర్వాత సంజయ్ చిత్రాలు బాజీరావు మస్తానీతోపాటు పద్మావత్ చిత్రాలలో కూడా నటించారు.

 

View this post on Instagram

No caption needed

@deepikapadukone #RamLeela

A post shared by Ranveer Singh (@ranveersingh) on

 

 

Ranveer Kapoor stares at the back of Deepika, the throwback Ram-Leela pic was posted by Ranveer himself on Instagram

The post దీపిక నడుముపై మనసు పారేసుకున్న వేళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: