మనమే వేతనాలు ఎక్కువ ఇస్తున్నాం: మల్లారెడ్డి

హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సోమవార మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇరువురి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపామని వివరించారు. ఆర్‌టిసి కార్మికులకు అడగకుండానే 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దక్కుతుందన్నారు. సమ్మెను బిజెపి, కాంగ్రెస్‌లు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయని విరుచుకపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్‌టిసిని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్‌టిసి కార్మికులకు ఇస్తున్న […] The post మనమే వేతనాలు ఎక్కువ ఇస్తున్నాం: మల్లారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సోమవార మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇరువురి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపామని వివరించారు. ఆర్‌టిసి కార్మికులకు అడగకుండానే 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దక్కుతుందన్నారు. సమ్మెను బిజెపి, కాంగ్రెస్‌లు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయని విరుచుకపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్‌టిసిని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్‌టిసి కార్మికులకు ఇస్తున్న వేతనాలెంత ?అని అడిగారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ఉందని కొనియాడారు. ప్రతీ వర్గం అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రలకు ఆర్‌టిసి కార్మికులు బలికావొద్దని మల్లారెడ్డి సూచించారు.

 

More Salary Give to RTC workers than Other States

The post మనమే వేతనాలు ఎక్కువ ఇస్తున్నాం: మల్లారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: