సమ్మె విరమించి …చర్చలకు రండి : కెకె

హైదరాబాద్‌ : ఆర్ టిసి కార్మికులు సమ్మె విరమించి, చర్చలకు రావాలని టిఆర్ఎస్ ఎంపి కె.కేశవరావు సూచించారు. ఆర్ టిసి కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆర్ టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సిఎం కెసిఆర్ ఎప్పుడూ చెప్పలేదని, ఈ అంశం మినహా ఇతర సమస్యలపై కార్మికులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆర్ టిసి కార్మికుల […] The post సమ్మె విరమించి … చర్చలకు రండి : కెకె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : ఆర్ టిసి కార్మికులు సమ్మె విరమించి, చర్చలకు రావాలని టిఆర్ఎస్ ఎంపి కె.కేశవరావు సూచించారు. ఆర్ టిసి కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆర్ టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సిఎం కెసిఆర్ ఎప్పుడూ చెప్పలేదని, ఈ అంశం మినహా ఇతర సమస్యలపై కార్మికులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆర్ టిసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని ఆయన గుర్తు చేశారు. గతంలో కార్మికులకు  44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చామని ఆయన చెప్పారు. ఆర్ టిసిని ప్రైవేటీకరించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కార్మికులు సమ్మె విరమించాలని, చర్చల ద్వాారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.

TRS MP KK Comments On TSRTC Strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమ్మె విరమించి … చర్చలకు రండి : కెకె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.