ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు అరెస్టు

శ్రీనగర్ : సోమవారం ఉదయం ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. గందర్బాల్‌లో ఈ ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందగానే తాము అప్రమత్తమై అక్కడ తనిఖీలు చేశామని వారు చెప్పారు. ఈ క్రమంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌  సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశామని, కశ్మీర్ లో వారు ఉగ్రదాడులకు వ్యూహరచన చేసినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు అయి […] The post ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీనగర్ : సోమవారం ఉదయం ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. గందర్బాల్‌లో ఈ ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందగానే తాము అప్రమత్తమై అక్కడ తనిఖీలు చేశామని వారు చెప్పారు. ఈ క్రమంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌  సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశామని, కశ్మీర్ లో వారు ఉగ్రదాడులకు వ్యూహరచన చేసినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు అయి ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పది ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two Hizbul Mujahideen Militants Arrest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.