ప్రధాని మోడీ సోదరుని కుమార్తె బ్యాగునే కొట్టేసిన దొంగలు

ఢిల్లీ:  తన చేతి బ్యాగు చోరీకి గురైందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ తాను ప్రధాని నరేంద్ర మోడీ సోదరుని కుమార్తెనని చెప్పలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుమార్తె దమయంతి మోడీ శనివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్ లేన్స్ ప్రాంతంలో ఆటో రిక్షా దిగుతుండగా ఆమె చేతిలోని బ్యాగును ఒక వ్యక్తి అపహరించాడు. ఆ బ్యాగులో రూ. 56,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, […] The post ప్రధాని మోడీ సోదరుని కుమార్తె బ్యాగునే కొట్టేసిన దొంగలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ:  తన చేతి బ్యాగు చోరీకి గురైందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ తాను ప్రధాని నరేంద్ర మోడీ సోదరుని కుమార్తెనని చెప్పలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుమార్తె దమయంతి మోడీ శనివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్ లేన్స్ ప్రాంతంలో ఆటో రిక్షా దిగుతుండగా ఆమె చేతిలోని బ్యాగును ఒక వ్యక్తి అపహరించాడు. ఆ బ్యాగులో రూ. 56,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని విలువైన పత్రాలు ఉన్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రధాని మోడీతో తనకు బంధుత్వం ఉన్నట్లు ఆమె ప్రస్తావించనప్పటికీ పోలీసులు తక్షణమే స్పందించి ఆమె ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిసిటివి ఫుటేజ్ సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి చోరీకి గురైన నగదు, రెండు సెల్ ఫోన్లు, విలువైన పత్రాలతో వారు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు సాధీనం చేసుకున్నారు. కాగా, కేసును త్వరితంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసినందుకు ఢిల్లీ పోలీసులను దమయంతి మోడీ అభినందించారు.

 

PM Modis niece handback snatched, Damayanthi Modi, daughter of Prahlad Modis handbag was snatched by two robbers

The post ప్రధాని మోడీ సోదరుని కుమార్తె బ్యాగునే కొట్టేసిన దొంగలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: