లోయలో పడిన జీపు: 8 మంది మృతి

డెహ్రాడూన్: ఉత్తరఖాండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు లోయలో పడిపోవడంతో ఎనిమిది ఘటనా స్థలంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పది మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జీపులో దేవల్ నుంచి ఘాష్ ప్రాంతానికి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా 200 అడుగుల లోతుగల లోయలో వాహనం పడింది. రెస్కూ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పట్ల ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపం వ్యక్తం చేశారు. వారి […] The post లోయలో పడిన జీపు: 8 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

డెహ్రాడూన్: ఉత్తరఖాండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు లోయలో పడిపోవడంతో ఎనిమిది ఘటనా స్థలంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పది మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జీపులో దేవల్ నుంచి ఘాష్ ప్రాంతానికి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా 200 అడుగుల లోతుగల లోయలో వాహనం పడింది. రెస్కూ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పట్ల ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 2018 జులైలో పౌరి జిల్లాలో బస్సు ప్రమాదంలో 48 మృతి చెందడంతో హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

8 Members Dead in Vehicle Fell into Gorge

The post లోయలో పడిన జీపు: 8 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.