అదనపు దసరా సెలవులు ఇవ్వాల్సిందే

 యధావిధిగా నేటి నుంచి తరగతులు ప్రారంభిస్తామని సందేశాలు పంపిన ప్రైవేటు విద్యాసంస్థలు  గురుకుల పాఠశాలలు పని చేస్తాయని ప్రకటించి తర్వాత నిర్ణయం మార్చుకున్న ప్రవీణ్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కారణంగా రాష్ట్రంలో దసరా సెలవులు ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ సెలవుల పొడిగింపుపై గురుకుల పాఠశాలలకు వర్తించదని ఆ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆదివారం సాయంత్రం తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి యథావిధిగా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. […] The post అదనపు దసరా సెలవులు ఇవ్వాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 యధావిధిగా నేటి నుంచి తరగతులు ప్రారంభిస్తామని సందేశాలు పంపిన ప్రైవేటు విద్యాసంస్థలు
 గురుకుల పాఠశాలలు పని చేస్తాయని ప్రకటించి తర్వాత నిర్ణయం మార్చుకున్న ప్రవీణ్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కారణంగా రాష్ట్రంలో దసరా సెలవులు ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ సెలవుల పొడిగింపుపై గురుకుల పాఠశాలలకు వర్తించదని ఆ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆదివారం సాయంత్రం తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి యథావిధిగా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. దీంతో దసరా సెలవులపై విద్యార్థ్ధులు, వారి తల్లిదండ్రుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే జరిగిన తప్పుతెలుసుకున్న గురుకుల కార్యదర్శి వెంటనే స్పందించి ఆగమేఘాలపై మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. దసరా సెలవులు గురుకుల పాఠశాలలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీంతో సెలవులపై నెలకొన్న సందిగ్ధత వీడింది. వాస్తవానికి ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన ప్రకారం దసరా సెలవులు ఈ నెల 11వ తేదీతో ముగిశాయి.

అయితే 12వ తేదీ రెండవ శనివారం, 13వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం నుంచి (14వ తేది) పాఠశాలలు పున ప్రారంభంకావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్‌టిసి కార్మికుల సమ్మె కారణంగా పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవులను మరో వారం రోజుల పాటు (19వ తేదీ) పొడిగించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు అధికారులు సెలవులను వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశించిన విధంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలు సెలవులను ప్రకటించాల్సిందేనన్నారు. సెలవులు ఇవ్వని పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

TS Govt to extend Dusshera holidays

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అదనపు దసరా సెలవులు ఇవ్వాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: