జోగులాంబ గుడికి కేంద్ర ప్రసాద్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆలంపూర్ జోగులాంబ దేవాలయం, సమీప ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు తోడు కేంద్ర ప్రభుత్వ ఊతం లభించింది. దక్షిణ కాశీగా పేరొందిన ఆలంపూర్ జోగులాంబ దేవాలయం అభివృద్ధి పనులను కేంద్రం ప్రసాద్ పథకంలో చేర్చింది. ప్రసాద్ (పర్యాటక, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కేంద్రం రూపొందించిన పథకం) పథకంలో చేర్చడంతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, యాక్షన్ ప్లాన్ ప్రకారం జరుగుతాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ దేవాలయం సమీపంలోనే అనుబంధ ఆలయాలు ఉన్నాయి. […] The post జోగులాంబ గుడికి కేంద్ర ప్రసాద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆలంపూర్ జోగులాంబ దేవాలయం, సమీప ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు తోడు కేంద్ర ప్రభుత్వ ఊతం లభించింది. దక్షిణ కాశీగా పేరొందిన ఆలంపూర్ జోగులాంబ దేవాలయం అభివృద్ధి పనులను కేంద్రం ప్రసాద్ పథకంలో చేర్చింది. ప్రసాద్ (పర్యాటక, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కేంద్రం రూపొందించిన పథకం) పథకంలో చేర్చడంతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, యాక్షన్ ప్లాన్ ప్రకారం జరుగుతాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ దేవాలయం సమీపంలోనే అనుబంధ ఆలయాలు ఉన్నాయి. తుంగభద్ర నది పక్కనే ఆలయం ఉంది. దీంతో కొన్ని వసతులు కల్పిస్తే తెలంగాణలోని శక్తిపీఠానికి వచ్చే భక్తులు, పర్యాటకులు పెరుగుతారు. హైదరాబాద్, బెంగుళూరు జాతీయ రహదారికి దగ్గర్లోనే శక్తిపీఠం ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలయంపై దృష్టిపెట్టి, అభివృద్ధి చేస్తుంది. దీనికి సహాయంగా కేంద్ర పథకం ప్రసాద్‌లో ఆలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని చేర్చినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీంతో సుమారుగా రూ.50 నుంచి 100 కోట్ల వరకు కేంద్ర నిధులు వస్తాయి. ఈ నిధులతో ప్రత్యేకంగా ఆలయం, ఆలయ సమీప ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు జరుగుతాయి.

ఆలయం అభివృద్ధిపై రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలు ఇదివరకే డిపిఆర్‌ను తయారు చేసి, కేంద్రానికి ప్రతిపాదనలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, త్రిపురాంతకం, సిద్ధవటం ఆలయాలతో పాటు తెలంగాణలోని ఉమామహేశ్వరం ఆలయాలకు ఆలంపూర్ ముఖద్వారంగా ఉంది. పాపనాసి ఆలయం, నవబ్రహ్మ ఆలయం, కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ స్థలంలో సంగమేశ్వరాలయం, మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయం, కృష్ణా పుష్కరఘాట్‌లు సమీప దూరంలోనే ఉన్నాయి. ప్రసాద్ స్కీంలో వచ్చే నిధులతో ఆలంపూర్‌లో సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఇందులో కొత్త బ్రిడ్జి, రోడ్ల నిర్మాణంతో పాటు జోగులాంబ, నవబ్రహ్మ ఆలయ పరిసరాలు, సంగమేశ్వరాలయం, పాపనాసి ఆలయం, కృష్ణా పుష్కరఘాట్, మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో సౌకర్యాలకు రూ.80 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించారు. ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉంది. దీంతో పురావస్తు నిబంధనలకు అనుగుణంగానే చర్యలు, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కేంద్ర నిధులతో ఆలయ పరిసరాల్లో పచ్చదనం, వసతి గృహాల నిర్మాణం, కళ్యాణమండపం నిర్మాణం, తాగునీటి సౌకర్యం, తుంగభద్ర నదిలో బోటింగ్ తదితర వసతులు కల్పించే అవకాశం ఉంది.

జోగులాంబ దేవాలయం చుట్టూ అభివృద్ధి పనుల కోసం సరిపడా ఖాళీ స్థలం లేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వమే భూమిని సేకరించాలి. లేకపోతే దాతలు విరాళంగా దేవాలయానికి ఇస్తే ఆయా స్థలాల్లో ప్రసాద్ నిధులతో అభివృద్ధి పనులు చేపడతారు. జోగులాంబ దేవాలయం అభివృద్ధి, అందుబాటులో ఉన్న స్థలాలపై కేంద్ర పర్యాటక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓ అంచనాకు వచ్చారు. పలు వివరాలతో సమగ్రంగా ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు, లేదా నవంబరు మొదటి వారంలో కేంద్ర బృందం, నిపుణులతో కలిసి మరోమారు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత ప్రసాద్ స్కీంలో జోగులాంబ దేవాలయం, సర్కూట్ అభివృద్ధికి ఎన్ని నిధులు వస్తాయో తేలుతుంది.

Jogulamba temple Gets Kendra Prasad Scheme

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జోగులాంబ గుడికి కేంద్ర ప్రసాద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: