నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు పురస్కారం

మన తెలంగాణ / ముషీరాబాద్: సుద్దాల హనుమంతు గొప్ప వాగ్గేయకారుడు, విప్లవకారుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివారం రాత్రి సుద్దాల ఫౌండేషన్ దశాబ్ది సందర్భంగా సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, డాక్టర్.పోతిరెడ్డి రంగయ్య, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తిలతో కలిసి సినీ దర్శక, నిర్మాత, కవి ఆర్.నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు పురస్కారాన్ని అందచేశారు. దీంతో 25 […] The post నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు పురస్కారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ / ముషీరాబాద్: సుద్దాల హనుమంతు గొప్ప వాగ్గేయకారుడు, విప్లవకారుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివారం రాత్రి సుద్దాల ఫౌండేషన్ దశాబ్ది సందర్భంగా సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, డాక్టర్.పోతిరెడ్డి రంగయ్య, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తిలతో కలిసి సినీ దర్శక, నిర్మాత, కవి ఆర్.నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు పురస్కారాన్ని అందచేశారు. దీంతో 25 వేల రూపాయల నగదు, జ్ఞాపికను ఇచ్చి శాలువాతో ఆర్.నారాయణమూర్తిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక పాటలు సుద్దాల హనుమంతు అందించారన్నారు.

ఆయన పాటలు వింటే సమాజమే ఉలిక్కిపడుతుందని తెలిపారు. సినీదర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం సుద్దాలకు, కాళోజీ, దాశరథికి ఇచ్చిన తరహాలో ఆయన విగ్రహాన్ని ప్రత్యేకమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. సుద్దాల పురస్కారం తనకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ సుద్దాల హనుమంతు వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తమ పాత్రికేయుడుగా ఎస్‌ఎస్.చారి, వై. నాగేశ్వర్‌రావు, పార్థసారథి రెడ్డిలకు న్మానం జరిగింది. అనంతరం ఎల్లమ్మ ఒగ్గుకథ బృందాన్ని సత్కరించారు.

R Narayana Murthy Received suddala hanumanthu Award

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు పురస్కారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: