కశ్మీర్‌ను విడిచిపెట్టి ఉగ్రవాదంపై పోరు సాగించడం మేలు

చండీగడ్ :కశ్మీర్ సంగతి విడిచిపెట్టి నిజాయితీగా ఉగ్రవాదంపై పోరు సాగించాలని, కశ్మీర్ విభజనను ఏ శక్తి ఆపలేదని, పదేపదే నిందించడం కొనసాగిస్తే ఎవరూ తన మార్గాలను బాగు చేయలేరని పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని  తుదముట్టించ లేకుంటే పోరుకు భారత్ సహకరించడానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలోని పటౌడీ, కర్నల్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాజ్‌నాధ్ పాల్గొని ప్రసంగించారు. రఫేల్ జెట్ విమానానికి దసరా నాడు శస్త్రపూజ చేయడాన్ని […] The post కశ్మీర్‌ను విడిచిపెట్టి ఉగ్రవాదంపై పోరు సాగించడం మేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చండీగడ్ :కశ్మీర్ సంగతి విడిచిపెట్టి నిజాయితీగా ఉగ్రవాదంపై పోరు సాగించాలని, కశ్మీర్ విభజనను ఏ శక్తి ఆపలేదని, పదేపదే నిందించడం కొనసాగిస్తే ఎవరూ తన మార్గాలను బాగు చేయలేరని పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని  తుదముట్టించ లేకుంటే పోరుకు భారత్ సహకరించడానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలోని పటౌడీ, కర్నల్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాజ్‌నాధ్ పాల్గొని ప్రసంగించారు. రఫేల్ జెట్ విమానానికి దసరా నాడు శస్త్రపూజ చేయడాన్ని కాంగ్రెస్ విమర్శించడంపై స్పందిస్తూ విమానంపై ఓం రాయడాన్ని కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతోందని వ్యాఖ్యానించారు. విపక్ష విమర్శలు పాకిస్థాన్‌కు ధైర్యమిస్తాయని విమర్శించారు. ఈ నెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు.

Union Defense Minister Rajnath Singh Warns To Pakistan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్‌ను విడిచిపెట్టి ఉగ్రవాదంపై పోరు సాగించడం మేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.