సాగు సంబురం పంటలు పుష్కలం

 ఈసారి మార్కెట్లు కొత్త పంటలతో నిండి పోతాయి  మద్దతు ధర కోసం రైతులు ఎగబడుతారు క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు పోటెత్తమనున్నాయని, మద్దతు ధర కోసం మార్కెట్లు నిండిపోనున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్ యార్డులు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ కేంద్రాలు ముందుగానే పరిశీలించి ఏర్పాట్లు సరిగ్గా […] The post సాగు సంబురం పంటలు పుష్కలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 ఈసారి మార్కెట్లు కొత్త పంటలతో నిండి పోతాయి
 మద్దతు ధర కోసం రైతులు ఎగబడుతారు
క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
– వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు పోటెత్తమనున్నాయని, మద్దతు ధర కోసం మార్కెట్లు నిండిపోనున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్ యార్డులు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ కేంద్రాలు ముందుగానే పరిశీలించి ఏర్పాట్లు సరిగ్గా ఉన్నది లేనిది పరిశీలించుకోవాలన్నారు. – ప్రభుత్వం ఇంతకుముందు జారీచేసి న చెక్ లిస్ట్‌లతో సరిచూసుకుని ఏమైనా ఏ ర్పాట్లు తక్కువగా ఉంటే యుద్దప్రాతిపదికన త గు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. – క లెక్టర్ల అనుమతితో పత్తి కొనుగోలుకు సంబంధించి సాధ్యమైనంత ఎక్కువగా స్పిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని, కావాల్సిన సాంకేతిక సౌకర్యాలు, వే బ్రిడ్జ్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. – కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకు ండా రైతులు వరస క్రమంలో వచ్చే విధంగా త గు ఏర్పాట్లు చేయాలన్నారు.

అవసరమైతే ముం దస్తుగా రైతులకు టోకెన్లు జారీచేయాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు. వ్యవసాయ మార్కెట్ల కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత అధికారులతో తక్షణమే సమావేశాలు ఏర్పాటు చేసి వారి వారి విధులు, బాధ్యతలను అప్పగిస్తూ తగిన ఉత్తర్వులు అందజేయాలని స్పష్టం చేశారు. తదనంతరం జరిగే పరిణామాలకు వారే బాధ్యులని మంత్రి హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో సంబంధిత సిబ్బంది రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి- కరెంటు సంబంధిత ఇబ్బందులు ఏర్పడినప్పుడు వెంటనే సరిచేసేందుకు తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. – రైతులు, సిబ్బందికి మార్కెట్ యార్డులలో తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. – అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. – మార్కెట్లకు వచ్చిన ధాన్యం అకాలవర్షాలకు నష్టపోకుండా తగిన సదుపాలను ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు.

టార్పాలిన్లు, లాంతర్లు, టార్చ్ లైట్లు తదితర పరికరాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలన్నారు. అక్కడక్కడా కొందరు దళారులు, వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడితే వెంటనే చట్టపరమయిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. – కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతుధర తెలిపే బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ఈ విషయం రైతులకు తెలిసేలా వివిధ పద్దతుల ద్వారా ప్రచారం చేపట్టాలని సంబంధిత అధికారులను, ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి ఆదేశించారు.

Minister Niranjan Reddy Comments On Crop Support Price

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగు సంబురం పంటలు పుష్కలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.