ఆర్‌టిసి జెఎసిలో తెలంగాణ వ్యతిరేకులు

 జెఎసి మాతో సంప్రదింపులు జరపలేదు, జరిపితే సిఎం దృష్టికి తీసుకువెళ్తాం, రాజకీయ పార్టీలు ఆర్‌టిసి ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయి : తెలంగాణ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన వారే ఈరోజు ఆర్‌టిసి యూనియన్ నాయకులతో కలిసి సమ్మెచేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాలనాయకుడు  కారం రవీందర్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఆర్‌టిసి సమ్మెకు ప్రభుత్వ ఉద్యోగసంఘాలకు సంబంధం లేదని కారం రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం […] The post ఆర్‌టిసి జెఎసిలో తెలంగాణ వ్యతిరేకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 జెఎసి మాతో సంప్రదింపులు జరపలేదు, జరిపితే సిఎం దృష్టికి తీసుకువెళ్తాం, రాజకీయ పార్టీలు ఆర్‌టిసి ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయి : తెలంగాణ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన వారే ఈరోజు ఆర్‌టిసి యూనియన్ నాయకులతో కలిసి సమ్మెచేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాలనాయకుడు  కారం రవీందర్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఆర్‌టిసి సమ్మెకు ప్రభుత్వ ఉద్యోగసంఘాలకు సంబంధం లేదని కారం రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆర్‌టిసి సమ్మెలో తెలంగాణ వ్యతిరేకులుకలిసి సమస్యలను జటిలం చేశారని నిందించారు. ఆర్‌టిసి యూనియన్ నాయకులు సమ్మెకు వెళ్లుతున్నట్లు మాకు చెప్పలేదు, మాసలహాతీసుకోలేదు, అర్‌టిసి సమ్మెకు ఉద్యోగసంఘాలకు సంబంధంలేదని ఆయన వివరించారు. ఆర్‌టిసి కార్మికసంఘాల నాయకులు మాతో సంప్రదిస్తే వారిసమస్యలను ప్రభుత్వదృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దు,ఆత్మహత్యలకు పాల్పడవద్దు సమస్యలు సానుకూలంగానే పరిష్కారం అవుతాయి. ఆర్‌టిసి సమ్మె కొన్ని రాజకీయశక్తుల చేతుల్లోకి వెళ్లడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యోగసంఘాల ప్రధానకార్యదర్శి మమత మాట్లాడుతూ ఆర్‌టిసి సమ్మెనేపథ్యంలో ఉద్యోగసంఘాలపై కొన్ని యూనియన్ల నాయకులు అసత్యప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపరిష్కారంకోసం ముఖ్యమంత్రిని కలిశామేకానీ ఆర్‌టిసి సమస్యలపై కాదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగసంఘాలు ప్రభుత్వంలో భాగమే, విధుల నిర్వహణకు అంతరాయం కలగకుండా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యోగసంఘాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఆర్‌టిసి జెఏసి నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రపోషించారు, అయితే ప్రస్తుతం ఆర్‌టిసి జెఏసిలో ఆర్‌టిసి నేతలు, నాయకులు సభ్యులుగాలేరు. రాజకీయ నాయకులతోకలిసి ఆందోళనలుచేస్తున్నారు. ఆర్‌టిసి జెఏసి నాయకులు మాతో సంప్రదిస్తే వారి సమస్యల పరిష్కారంకోసం సిఎం దృష్టికి తీసుకువెళ్లుతామని చెప్పారు.

Karam Ravinder Reddy Comments On RTC Strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్‌టిసి జెఎసిలో తెలంగాణ వ్యతిరేకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: