సిరీస్ మనదే…

దక్షిణాఫ్రికాపై పుణె టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన సఫారీలు చెలరేగిన భారత బౌలర్లు ..సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ సేన పుణె: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 601 పరుగులతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా మూడో […] The post సిరీస్ మనదే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దక్షిణాఫ్రికాపై పుణె టెస్టులో
ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం

రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన సఫారీలు
చెలరేగిన భారత బౌలర్లు ..సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ సేన

పుణె: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 601 పరుగులతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 326 పరుగుల ఆధిక్యత లభించింది. ఫలితంగా ఆదివారం నాలుగో రోజు ఫాలోఆన్ ఆడాల్సి వచ్చిన దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్‌తో పాటుగా సిరీస్‌ను కూడా దక్కించుకుంది. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ టీ బ్రేక్ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్ (48),బావుమా (38), ఫిలాండర్ (37),మహరాజ్ (22)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా ఘోరంగా విఫలమైనారు. దాంతో కోహ్లీ సేన ఇన్నింగ్స్ 137 పరుగులతో భారీ విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ను తొలి వికెట్‌గా ఇశాంత్ ఔట్ చేయగా, డిబ్రుయిన్(8)ను ఉమేశ్‌యాదవ్ బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్ సాహా అద్భుతమైన క్యాచ్‌తో డిబ్రుయిన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 21 పరుగులకే సఫారీలు రెండు వికెట్లు కోల్పోగా డుప్లెసిస్(5)ను అశ్విన్ ఔట్ చేశాడు.సాహా మరోసారి చక్కటి క్యాచ్ పట్టడంతో డుప్లెసిస్ భారంగా వెనుదిరిగాడు. ఆపై ఎల్గర్, డికాక్(5), బావుమా, ముత్తుసామిలు కూడా వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో మహరాజ్‌ఫిలాండర్ జోడీ మరోసారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ జోడీ 8 వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఫిలాండర్ ఔట్ కాగా, ఆ తర్వాత కొద్ది సేపటికే రబడా కూడా పెవిలియన్ చేరాడు. చివరి వికెట్‌గా మహరాజ్ ఔట్ కావడంతో టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం దక్కింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలు చెరి మూడు వికెట్లు సాధించగా, అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, ఇశాంత్‌లకు చెరో వికెట్ దక్కింది. ఈ టెస్టు విజయంతో భారత్ సిరీస్‌ను ఇంకో టెస్టు మిగిలి ఉండగానే 2 0తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా నామమాత్రమైన మూడో టెస్టు శనివారం నుంచి రాంచీలో జరుగుతుంది.

స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ 5/601 డిక్లేర్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 275 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండోఇన్నింగ్స్: మార్కరమ్ ఎల్‌బి ఇశాంత్ శర్మ 0, డీన్ ఎల్గర్ సి ఉమేశ్ యాదవ్ బి అశ్విన్ 48, డి బ్రుయిన్ సి సాహా బి ఉమేశ్ 8, డుప్లెసిస్ సి సాహా సి అశ్విన్ 5, బవుమా సి రహానే బి జడేజా 38, డికాక్ బి జడేజా 5, ముత్తుసామి సి రోహిత్ శర్మ, బి షమీ9, ఫిలాండర్ సి సాహా బి ఉమేశ్ 37, కేశవ్ మహరాజ్ ఎల్‌బి జడేజా 22,కగిసో రబడా సి రోహిత్ శర్మ, బి ఉమేశ్ 4, అన్రిచ్ నోర్జీ నాటౌట్ 0,ఎక్స్‌ట్రాలు 13, మొత్తం (67.2 ఓవర్లలో) 189 ఆలౌట్.
వికెట్ల పతనం: 1 0, 2 21, 3 70, 4 71, 5 79, 6 125, 7 129, 8 185, 9 189.
భారత బౌలింగ్: ఇశాంత్ శర్మ 5 17 1, ఉమేశ్ యాదవ్ 8 22 3, మహమ్మద్ షమీ 9 34 1,రవిచంద్రన్ అశ్విన్ 21 45 2, రవీంద్ర జడేజా 21.2 52 3, రోహిత్ శర్మ 2 4 0, విరాట్ కోహ్లీ 1 4 0.

 India beat South Africa by an innings and 137 runs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిరీస్ మనదే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: