మూసీలో నీటి మట్టాన్ని పెంచుతాం

  ప్రాజెక్టు వద్ద విరిగిన గేటు స్థానంలో నూతన గేట్ల బిగింపు పూర్తి, పనులను పూర్తి చేయించిన మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట : మూసీలో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని పెంచుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మూసీ డ్యాం వద్ద ఇరిగిన గేట్‌స్థానంలో నూతన గేట్స్‌ను బిగియించారు. మంత్రి దగ్గరుండి పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కొత్తగేట్స్ బిగియింపు ప్రక్రియ పూర్తి అయినట్లు తెలిపారు. దీంతో […] The post మూసీలో నీటి మట్టాన్ని పెంచుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రాజెక్టు వద్ద విరిగిన గేటు స్థానంలో నూతన గేట్ల బిగింపు పూర్తి, పనులను పూర్తి చేయించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : మూసీలో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని పెంచుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మూసీ డ్యాం వద్ద ఇరిగిన గేట్‌స్థానంలో నూతన గేట్స్‌ను బిగియించారు. మంత్రి దగ్గరుండి పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కొత్తగేట్స్ బిగియింపు ప్రక్రియ పూర్తి అయినట్లు తెలిపారు. దీంతో నీటి వృథాను అరికట్టామన్నారు. స్టాఫ్‌లాగ్ గేట్లను యుద్ధ ప్రాతిపధికన తయారు చేయించి బిగియించామన్నారు. శాశ్వస ప్రాతిపదికన మళ్లీ ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

మూసీ ఆయకట్టు రైతులలో భరోసా నింపామని, మూసీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపి పంటలకు నీరందిస్తామన్నారు. ఆదివారం మూసీ ప్రాజెక్టు నుంచి 8ఎలిమెంట్స్ డ్యాం వద్దకు చేరాయని 4గేట్లను అమర్చినట్లు తెలిపారు. మరో 4ఆదివారం రాత్రి వరకు అమరుస్తామన్నారు. నీటిపారుదల సిబ్బంది ఆగమేఘాల మీద కంటిమీద కులుకు లేకుండా కష్టపడ్డామన్నారు. ఏండ్లనాటి పాపం మూసీ ఆయకట్టు రైతాంగానికి శాపంగా మారుతుందేమో అన్న సందేహం పటాపంచలైంది అన్నారు. సీమాంధ్రుల ఏలుబడిలో తెలంగాణ పాలకుల కండ్లు కప్పి 1991ప్రాంతంలో తరలిపోయిన స్టాఫ్‌లాగ్ గేట్లను వెనక్కి తెప్పించామన్నారు.

We will raise the water level in Musi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూసీలో నీటి మట్టాన్ని పెంచుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: