జాబ్‌లడిగితే అదిగో చంద్రుడంటారు

  సమస్యలను పక్కతోవబట్టిస్తున్నారు సంపన్నుల బలోపేతమే ఆయన పాలసీ మోడీ సర్కార్‌పై రాహుల్ విమర్శ లాతూర్ : అటు మోడీ ఇటు మీడియా వారు దేశంలోని ప్రధాన అంశాలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ, అమిత్ షాలు యత్నిస్తూ ఉంటే, వారికి మీడియా వంతపాడుతూ వస్తోందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఆదివారం లాతూరు జిల్లాలోని అవూసాలో ప్రసంగించారు. యువత […] The post జాబ్‌లడిగితే అదిగో చంద్రుడంటారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమస్యలను పక్కతోవబట్టిస్తున్నారు
సంపన్నుల బలోపేతమే ఆయన పాలసీ
మోడీ సర్కార్‌పై రాహుల్ విమర్శ

లాతూర్ : అటు మోడీ ఇటు మీడియా వారు దేశంలోని ప్రధాన అంశాలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ, అమిత్ షాలు యత్నిస్తూ ఉంటే, వారికి మీడియా వంతపాడుతూ వస్తోందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఆదివారం లాతూరు జిల్లాలోని అవూసాలో ప్రసంగించారు. యువత ఉద్యోగాల గురించి అడిగితే ఈ ప్రభుత్వం చంద్రుడి వైపు చూడమంటుందని చమత్కరించారు. ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైన సర్కారు గురించి తెలియచేయలేని మీడియా చంద్ర మండల యాత్రల గురించి గొప్పగా తెలియచేస్తూ ఉంటాయని విమర్శించారు.

అయితే అక్కడా ఫెయిలయ్యారని, అయితే దీనిని వెలుగులోకి రాకుండా చూసుకుంటారని రాహుల్ అన్నారు. తపలువురు నేతలతో కలుస్తూ వచ్చిన ప్రధాని మోడీ చైనా అధినేతతో మంతనాలలో డోక్లామ్ ప్రతిష్టంభన గురించి ఏదైనా మాట్లాడారా? అని రాహుల్ ప్రశ్నించారు. 2017లో మన భూభాగపు అతిక్రమణకు చైనా పాల్పడిందని , దీనిని ప్రధాని ప్రస్తావించారా? లేదా అనేది వెల్లడికావల్సి ఉందన్నారు. దేశంలోని 15 మంది అత్యంత సంపన్నులకు ప్రభుత్వ ఖజానాని పంచిపెడుతున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్ వర్గాలకు పన్నుల రాయితీలు కల్పించి ఇదే సరైన ఆర్థిక సంస్కరణ అని చెపుతూ ఉంటే మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటూ ఉంటే ఇక నిజమైన న్యాయం సంగతి ఏమిటని ప్రశ్నించారు.

Youth asks about jobs, govt asks them to watch Moon

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జాబ్‌లడిగితే అదిగో చంద్రుడంటారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: