నా చేతిలో ఉన్నది అక్యుప్రెజర్ రోలర్

  న్యూఢిల్లీ: మహాబలిపురం బీచ్‌లో ప్రధాని మోడీ చేతిలో ఉన్న టార్చి వంటి పరికరం ఏమిటనేది అందరిలో ఆసక్తిని కలిగించింది. చైనా అధినేతతో చర్చలకు వచ్చిన ప్రధాని తెల్లవారకముందే తన అలవాటుగా పాదరక్షలు లేకుండా సముద్రపు ఒడ్డున మార్నింగ్ వాక్ వెళ్లారు. ఈ సందర్భంగానే తాను తరచూ చెప్పే స్వచ్ఛ భారత్‌ను చేపట్టారు. ఒక చేతిలో కవర్ పట్టుకుని బీచ్‌లోని చెత్తాచెదారం, పారేసిన సీసాలను ఓ చేత్తో తీసి కవర్‌లో వేసుకుంటూ వెళ్లడం, మరో చేతిలో ఒక […] The post నా చేతిలో ఉన్నది అక్యుప్రెజర్ రోలర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: మహాబలిపురం బీచ్‌లో ప్రధాని మోడీ చేతిలో ఉన్న టార్చి వంటి పరికరం ఏమిటనేది అందరిలో ఆసక్తిని కలిగించింది. చైనా అధినేతతో చర్చలకు వచ్చిన ప్రధాని తెల్లవారకముందే తన అలవాటుగా పాదరక్షలు లేకుండా సముద్రపు ఒడ్డున మార్నింగ్ వాక్ వెళ్లారు. ఈ సందర్భంగానే తాను తరచూ చెప్పే స్వచ్ఛ భారత్‌ను చేపట్టారు. ఒక చేతిలో కవర్ పట్టుకుని బీచ్‌లోని చెత్తాచెదారం, పారేసిన సీసాలను ఓ చేత్తో తీసి కవర్‌లో వేసుకుంటూ వెళ్లడం, మరో చేతిలో ఒక పరికరం ఉండటం కనిపించింది. ట్విట్టర్‌లో పొందుపర్చిన 3 నిమిషాల వీడియోలో ఇది స్పష్టం అయింది. అనుమానం వచ్చిందే తడువుగా సామాజిక మాధ్యమికులు ఆదివారం ప్రధాని మోడీనే స్వయంగా అడిగారు.

ఈ పరికరం ఏమిటని చాలా మంది అడుగుతున్నారు. కొందరు ఇది తక్కువ బరువుండే డంబెల్ అని భావిస్తున్నారని, కొందరు ఒక కర్ర అని అనుకుంటున్నారని, అయితే ఇదేమిటనేది తాను చెప్పదల్చుకుంటున్నట్లు తెలిపారు. ఇది ఆక్యుప్రెజర్ రోలర్ అని, తాను ఎక్కడికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసేటప్పుడు దీనిని వెంట తీసుకువెళ్లుతానని తెలిపారు. రక్త ప్రసరణను ఈ పరికరం నియంత్రిస్తుందన్నారు. నిద్రలేమి, జీర్ణవ్యాధులు, తలనొప్పితో బాధపడుతున్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని, తన చేతిలో ఉన్నదదే అని ప్రధాని తెలిపారు. ప్రత్యేకించి ఒత్తిడి నుంచి గట్టెక్కిస్తుందని వివరించారు.

Modi was carrying an acupressure roller while plogging

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా చేతిలో ఉన్నది అక్యుప్రెజర్ రోలర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.