రెండో షెడ్యూల్‌లో ‘ఒరేయ్.. బుజ్జిగా’

  యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆరట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ’ఒరేయ్.. బుజ్జిగా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ”ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ జరుగుతుంది. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగిన క్యూట్ లవ్‌స్టోరీ ఇది. […] The post రెండో షెడ్యూల్‌లో ‘ఒరేయ్.. బుజ్జిగా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆరట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ’ఒరేయ్.. బుజ్జిగా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ”ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ జరుగుతుంది. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగిన క్యూట్ లవ్‌స్టోరీ ఇది.

సెన్సిటివ్ లవ్‌స్టోరీ ’గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌గారు మరో డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్‌గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ’ఒరేయ్.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.

Raj Tarun new movie Orey bujjiga

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెండో షెడ్యూల్‌లో ‘ఒరేయ్.. బుజ్జిగా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: