నేటి తరానికి ప్రతినిధి

కొంత మంది జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కచ్చితంగా ఇతరుల్లోనూ మార్పు తెస్తాయి. అలాంటి జీవితగాథే ‘ముంబయి సివంగి’గా పిలుచుకునే డీసీపీ ఎన్. అంబికది. పట్టుదలకు మారు పేరు ఆమె. చిన్నవయసులోనే పెళ్లయింది. పద్దెనిమిదేళ్లకే ఇద్దరు బిడ్డలకు తల్లయింది. అంతటితో జీవితం అయిపోయిందనుకోలేదు అంబిక. ఇంకా ఏదో సాధించానుకుంది. భర్త ప్రోత్సాహంతో తిరిగి చదువు కోవడం మొదలుపెట్టింది. పట్టుదలతో సమస్యలను అధిగమించి ఐపిఎస్ సాధించింది. తను సాధించిన ఈ విజయాన్ని గుర్తుచేసుకుంటూ “నా భర్త పోలీస్ కానిస్టేబుల్. ఓ […] The post నేటి తరానికి ప్రతినిధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొంత మంది జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కచ్చితంగా ఇతరుల్లోనూ మార్పు తెస్తాయి. అలాంటి జీవితగాథే ‘ముంబయి సివంగి’గా పిలుచుకునే డీసీపీ ఎన్. అంబికది. పట్టుదలకు మారు పేరు ఆమె. చిన్నవయసులోనే పెళ్లయింది. పద్దెనిమిదేళ్లకే ఇద్దరు బిడ్డలకు తల్లయింది. అంతటితో జీవితం అయిపోయిందనుకోలేదు అంబిక. ఇంకా ఏదో సాధించానుకుంది. భర్త ప్రోత్సాహంతో తిరిగి చదువు కోవడం మొదలుపెట్టింది. పట్టుదలతో సమస్యలను అధిగమించి ఐపిఎస్ సాధించింది.

తను సాధించిన ఈ విజయాన్ని గుర్తుచేసుకుంటూ “నా భర్త పోలీస్ కానిస్టేబుల్. ఓ రోజు పోలీస్ పరేడ్‌కు హాజరు కావాలంటూ ఉదయాన్నే బయలు దేరాడు. ఆ కార్యక్రమాన్ని నేను టివిలో చూశాను. డీజీపీ, ఐజీ హాజరయ్యారు. వారికి పోలీసులు నమస్కరిస్తూ చేసిన గౌరవమర్యాదలు చూసి ఆశ్చర్యపోయాను. మా వారు ఇంటికి రాగానే ‘డీజీపీ, ఐజీ అంటే ఎవరు’ అని అడిగాను. ‘వాళ్లు మా పోలీస్ డిపార్టుమెంట్‌లో మొదటి ర్యాంకు అధికారులని’ చెప్పాడాయన. అప్పటి వరకూ ఇల్లు, పిల్లలే నా ప్రపంచం. అప్పుడే నేను కూడా ఆ స్థాయి అధికారిణి కావాలని నిర్ణయించుకున్నాను. అదంత సులువుగాదనీ తెలుసు. ఐనా సాధించి తీరాలనుకున్నా” అంటూ గుర్తు చేసుకుంది.

తమిళనాడుకు చెందిన అంబికకు 14 ఏళ్ళ వయసులోనే పెళ్లయింది. మేజర్ అయ్యేసరికి ఇద్దరు అమ్మాయిలకు (ఐగాన్, నిహారిక) తల్లి అయింది. ఇంటి పనులు, పిల్లల ఆలనాపాలనా.. ఇదే ఆమె జీవితం. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారి కావాలని నిర్ణయం తీసుకున్నాక ఆలోచించుకుంటే ఆమెకు కళ్ళెదుట అనేక ఆటంకాలు కనిపించాయి. హైస్కూల్ దాటకుండానే జరిగిన పెళ్ళితో ఆమె చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. పుస్తకాలకు దూరమై చాలా రోజులయింది. తన కల నెరవేరుతుందో? లేదో? అనే సందేహంలో ఉన్న ఆమెకు భర్త అండగా నిలిచారు. ఆమెతో ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలు రాయించాడు. తర్వాత ఇంటర్ డిగ్రీ పూర్తిచేసి సివిల్స్ రాసేందుకు అర్హత సంపాదించింది.

మొదటి ప్రయత్నంలోనే ఆమె విజయం పొందలేదు. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించింది. ఆమె చెన్నైలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంది. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్… ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. అయితే మొదటి మూడు ప్రయత్నాల్లోనూ ఆమె విఫలమయింది. అంబిక భర్త ‘ఇక ఇంటికి వచ్చెయ్’ అన్నా కూడా నిరుత్సాహ పడకుండా మరొక్క ప్రయత్నం చేస్తానంది. మరింత శ్రమించింది. చివరకు 2008లో ఐపిఎస్‌కు ఎంపికయింది. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయింది. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ‘ముంబాయి సివంగి’ అంటూ పిలుస్తుంటారు. విధి నిర్వహణకు, సేవాతత్పరతకు గుర్తింపుగా ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్- 2019’ పురస్కారాన్ని అందుకుంది అంబిక.

Ambika appointed as Mumbai North Division DCP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేటి తరానికి ప్రతినిధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: