జుట్టు సమస్యకి మర్దనా మేలు!

  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శిరోజాలకు సంబంధించి కొత్త కొత్త సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. ఒత్తుగా, చిక్కగా ఉండే జుట్టు హఠాత్తుగా పల్చబడి పోతూ ఉంటుంది. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా వాతావరణం, నీరు మారితే ఈ సమస్య అకస్మాత్తుగా మొదల వుతుంది. సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వేడి నూనెతో మర్దనా జుట్టు రాలడాన్ని అరికడుతుందని ట్రైకాలజిస్టులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోవడం ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఏం చేయాలో తెలియక […] The post జుట్టు సమస్యకి మర్దనా మేలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శిరోజాలకు సంబంధించి కొత్త కొత్త సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. ఒత్తుగా, చిక్కగా ఉండే జుట్టు హఠాత్తుగా పల్చబడి పోతూ ఉంటుంది. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా వాతావరణం, నీరు మారితే ఈ సమస్య అకస్మాత్తుగా మొదల వుతుంది. సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వేడి నూనెతో మర్దనా జుట్టు రాలడాన్ని అరికడుతుందని ట్రైకాలజిస్టులు చెబుతున్నారు.

జుట్టు ఊడిపోవడం ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు. జుట్టుకు మంచి ఆహారం కొబ్బరి నూనె మాత్రమే అంటున్నారు నిపుణులు. శిరోజాలకు నూనె పెడితే మంచి పోషకాలు అందించినట్లు అవుతుంది. ఇందుకోసం ఖరీదైన మాయిశ్చరైజర్లు అవసరం లేదు. ఇంట్లో ఉండే కొబ్బరినూనె అయినా పర్లేదు. శిరోజాలు చిన్న చిన్న పాయలుగా విడదీసి చేతిలో కొద్దిగా నూనెను పోసుకుని మాడుకు రాసుకోవాలి. పూర్తిగా మాడంతా నూనె అంటాలి. ఐదు నిమిషాలు మర్దనా చేయాలి. వేడి అవసరం కాబట్టి ఆవిరి పట్టాలి. నూనె మాడుకు త్వరగా ఇంకుతుంది. వేడి నీటిలో టవల్ ముంచి పిండి, వేడిగా ఉండగానే తలపై కప్పినట్టు పెట్టుకోవాలి. చల్లగా అవగానే మళ్లీ ఇంకో వేడి టవల్ పెట్టుకోవాలి. ఇలా గంటసేపు చేయాలి.

రాత్రంతా నూనె అలా వదిలేసి ఉదయాన్నే మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. కండిషనర్‌లను చివరకు అప్లయ్ చేయాలి. అప్పుడు జుట్టు మెత్తగా మెరుస్తూ ఉంటుంది. వీక్లీ హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ చేసుకుంటూ ఉంటే జుట్టు ఎదుగుతుంది. మాడుకు సరిగ్గా మసాజ్ చేసుకుంటే రక్తసరఫరా జుట్టు కుదుళ్లలోకి చక్కగా జరుగుతుంది. ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మాడుకు కండిషనర్ లభిస్తుంది. కుదుళ్లు బలంగా అయి మసాజ్ ద్వారా రక్తనాళాలు తెరచుకుని సరఫరా మెరుగవుతుంది. హెయిర్ ఫాలికల్ సామర్ధం పెరిగి జుట్టు పెరుగుతుంది. సూర్య కిరణాలు, కఠినమైన వాతావరణ ప్రభావం నుంచి జుట్టును పరిరక్షించటంలో ఆయిల్ మసాజ్ ఎంతో ఉపయోగపడుతుంది.

జుట్టు పెరిగేందుకు కటింగ్: సాధారణంగా ట్రిమ్ చేస్తూ ఉంటే పొడవు తగ్గి పోతుందని అంటారు. కానీ జుట్టు చివర్లను 810 వారాలకు ఒకసారైనా ట్రిమ్ చేయాలి. చివర్లు చిట్ల్లిపోతాయి. ఆరు వారాల వ్యవధిలో జుట్టు ముప్పావు అంగుళం పెరుగుతుంది. కాబట్టి సాధారణ ట్రిమ్స్ తోడుగా జుట్టు చిట్లినపుడు పావు, లేదా అరంగుళం హెల్త్ ట్రిమ్ కూడా జతచేయాలి. కానీ జుట్టు పెరుగుతుందనే అపోహతో కట్ చేయకూడదు. జుట్టు నెలకు అర అంగుళం పెరుగుతుంది. కట్ చేయడం వల్ల ఊడటం తగ్గిన భ్రాంతి కలుగుతుంది. కానీ రాలే వెంట్రుకలు రాలిపోతూనే ఉంటాయి. మాడు మసాజ్ చేసుకోవటం, ఆరోగ్యవం తమైన జీవన శైలి, బి కాంపెక్స్ వంటి విటమిన్లు తీసుకోవటం, ఆరోగ్యపూరితమైన డైట్ తీసుకోవటం ద్వారా శిరోజాలు శీఘ్రంగా పెరుగుతాయి.

కలరింగ్‌తో జాగ్రత్త: కలరింగ్ వాడటంపైన పరిమితి అవసరం. ఎక్కువగా కలర్ వేస్తే జుట్టు బలహీనపడి తెగిపోతుంది. మరీ పల్చగా అనిపిస్తే హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లు సమస్య ను దాచగలవు. కాస్త తేలికగా ఉండేవి ఎంచుకుంటే జుట్టు కుదుళ్లకు ఒత్తిడి ఉండదు.

ఎక్స్‌టెన్షన్లు ఎన్నో రకాలు: చాలా చౌకగా దొరికేవి సింథటిక్ ఎక్స్‌టెన్షన్లు. వీటికి హీటింగ్ స్టయిలింగ్ కుదరవు. రెండు నెలలు హాయిగా వాడుకోవచ్చు. మానవ వెంట్రుకలు కూడా సహజమైనవి కాబట్టి, లుక్‌ఫీల్ రెండూ బావుం టాయి. మంచి క్వాలిటీ వెంట్రుకలు వాడితే సం వత్సరం దాకా బావుంటాయి. సులువుగా స్టయి లింగ్ చేసుకోవచ్చు. ఇక రెమీ హెయిర్ నాణ్య మైన క్వాలిటీ. తాత్కాలిక ఎక్స్‌టెన్షన్లు క్లిప్‌తో ఫిట్ చేస్తారు. వీటిని ఎవరి సాయం లేకుండా సులు వుగా అమర్చుకోవచ్చు. మైక్రో రింగ్ లూప్స్ చిన్న చిన్న రింగ్స్‌కు వెంట్రు కలను ఎటాచ్ చేసి సొంత శిరోజాలతో కలుపుతారు. వెస్ట్, ఫ్రీ బాండెడ్ ఎక్స్‌టెన్షన్లు ప్రీల్యూస్ట్ ఇవన్నీ సెలూన్‌లో కొన్ని పద్ధతుల ద్వారా అప్లయ్ చేస్తారు.

శ్రద్ధగా కాపాడుకోవాలి: ఎక్స్‌టెన్షన్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పొడవుగా ఇంటాక్ట్‌గా మెయిన్‌టెయిన్ చేయటానికి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ చిక్కులు పడనీయకూడదు. నిద్రించే సమయంలో తలచుట్టూ సిల్క్ క్లాత్ చుట్టు కోవాలి. ప్రత్యేకంగా తయారు చేసిన షాంపుతో శుభ్రం చేయాలి. ముఖ్యంగా హ్యూమన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్లు వాడుతుంటే మరింత శ్రద్ధ తీసుకోవాలి. సరైన కండిషనింగ్ చేసుకోవాలి. ఏ స్టయిలింగ్ పరికరాన్ని ఎక్స్‌టెన్షన్ బాండ్‌కు సమీపంగా వాడొద్దు.
ఇలా చేస్తే జుట్టు బలహీనమై ఈ ఎక్స్‌టెన్షన్లు ఊడిపడిపోతాయి. జుట్టు పొడవును పెంచేందుకు, కలర్ ఇచ్చేందుకు, ఎక్స్‌టెన్షన్లు సురక్షితమైన ప్రత్యామ్నాయం. పొడవు జుట్టు కోరుకునేవారు నిరభ్యంతరంగా వీటిని వాడుకోవచ్చు.

Hair problems solved with easy tips

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జుట్టు సమస్యకి మర్దనా మేలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: