గుంటూరు మాఫియా

  జిల్లాలో విచ్చలవిడిగా గుంటూరు మందుల విక్రయం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఏజెంట్లు అవగాహన కల్పించటంలో విఫలం పంటలపై తీవ్ర ప్రభావం బిల్లులేదు.. నియంత్రణ లేదు హెచ్చరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ఖమ్మం : బయో మందుల వాడకం వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరకే వస్తుండటంతో ఈ మందులను పంటలకు విచ్చలవిడిగా పిచికారి చేస్తున్నారు. పురుగు మందుల దుకాణాల్లో లభించే మందుల కంటే మూడింతల తక్కువ ధర ఉండటంతో వీటికి ప్రస్తుతం ఎక్కువ గిరాకీ ఉంది. ఖమ్మం […] The post గుంటూరు మాఫియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జిల్లాలో విచ్చలవిడిగా గుంటూరు మందుల విక్రయం
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఏజెంట్లు
అవగాహన కల్పించటంలో విఫలం
పంటలపై తీవ్ర ప్రభావం
బిల్లులేదు.. నియంత్రణ లేదు
హెచ్చరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఖమ్మం : బయో మందుల వాడకం వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరకే వస్తుండటంతో ఈ మందులను పంటలకు విచ్చలవిడిగా పిచికారి చేస్తున్నారు. పురుగు మందుల దుకాణాల్లో లభించే మందుల కంటే మూడింతల తక్కువ ధర ఉండటంతో వీటికి ప్రస్తుతం ఎక్కువ గిరాకీ ఉంది. ఖమ్మం జిల్లాలో రైతులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నుండి రైళ్ళల్లో తెచ్చుకుంటున్నారు. పంటలకు వచ్చే అన్ని రకాల రోగాలకు లోకల్‌గా తయారుచేసిన మందులను గుంటూరులో వ్యాపారులు అమ్ముతున్నారు. వారి వద్దకు వెళ్ళిన రైతులను పంట పొలాల్లో ఏ ఏ రోగాలు ఉన్నాయో తెలుసుకొని అవసరమైన మందులను డబ్బాలో పోసి ఇస్తున్నారు. ఈ మందులకు ఎలాంటి రశీదులు ఇవ్వరు. ఈ మందులను పంటపై పిచికారి చేయగానే, పురుగు, దోమలు పోతుండటంతో రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

గుంటూరు బయో మందుల అమ్మకానికి ఖమ్మం జిల్లాలోను ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు వెళ్ళలేని రైతుల కోసం ప్రత్యేకంగా సెంటర్లు వెలుస్తున్నాయి. కొణిజర్ల మండలంలో కూడా గుంటూరు మందులు విక్రయానికి ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వ్యవసాయ అధికారులకి ఈ విషయం తెలిసినా నామమాత్రంగా ఉంటున్నారు. కొణిజర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో భారీగా గుంటూరు మందులు తెప్పించి ఇక్కడి రైతులకు అమ్ముతున్నారు. ఎంతో కొంతపైసలు మిగులుతాయని భావిస్తున్న మరి కొందరు రైతులు కూడా ఇలాగే చేస్తున్నారు. బయో మందుల అమ్మకాలపై నియంత్రణ లేకపోవటంతో జోరుగా కొనసాగుతున్నాయి. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవటం లేదు.

ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం, మల్లుపల్లి, మెక్‌ఆలకుంట, గుబ్బగుర్తి, లక్ష్మీపురం, చుట్టు పక్కల గ్రామాల నుండి రైతులు గ్రూపులుగా గుంటూర్ ట్రైన్‌లో వెళ్ళి ఒకేసారి పది వేల చొప్పున మందులు తెచ్చుకుంటున్నారు. ఈ మందులు వాడటంతో తీవ్ర నష్టం పొంచి ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటిని స్ప్రే చేసిన మొదటి రోజే పంట తేజస్సు కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో వచ్చే నష్టాలు పసిగట్టలేకపోతున్నారు. వీటి వాడకంతో మొక్కలు సహజత్వం పూర్తిగా కోల్పోతాయని, నేల దెబ్బతింటుందని, పంట దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గుంటూరు మందులు వాడరాదు
ప్రామాణికత లేని బయో మందులను రైతులు పిచికారి చేయవద్దు. వాటిని ఇక్కడ అమ్మితే దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. ఈ మందులతో పంటలకు తాత్కాలికంగా ఉపశమనం తప్ప రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
– డి.బాలాజి, మండల వ్యవసాయ అధికారి
నిత్యవసర సరుకులు రేషన్ షాపులకు అందించాలి

Farmers do not spray non-standard Bio-Drugs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుంటూరు మాఫియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: