ఖమ్మంలో ఆర్‌టిసి ఆందోళన ఉద్రిక్తం

  ఖమ్మం : ఇద్దరు ఆర్‌టిసి కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం… ఆర్‌టిసి సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు అవుతున్నా ఒక కొలిక్కి రాకపోవడంతో ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బస్‌డిపో వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న తోటి సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. దీంతో […] The post ఖమ్మంలో ఆర్‌టిసి ఆందోళన ఉద్రిక్తం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : ఇద్దరు ఆర్‌టిసి కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం… ఆర్‌టిసి సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు అవుతున్నా ఒక కొలిక్కి రాకపోవడంతో ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బస్‌డిపో వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న తోటి సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి రాపర్తినగర్..2 వివేకానంద నగర్ కాలనీలో తన ఇంటి చేరుకొని మారోమారు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన చిన్న కుమారుడు కార్తీక్ రెడ్డి తండ్రిని రక్షించే ప్రయత్నంలో అతడికి కూడా గాయాలయ్యాయి.

వెంటనే వారిని స్థానికులు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌రెడ్డి శరీరం 75 శాతం కాలిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా దెవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ’38 వేల మంది కార్మికులకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించానని’ విలేకరుల ముందు వాపోయాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. తండ్రిని రక్షించేక్రమంలో స్వల్పగాయాలకు గురైన కుమారుడిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి సమ్మె శిబిరంలో ఉన్నా ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులంతా హుటాహుటినా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఈ సంఘటనతో కలెక్టరేట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కార్మికులకు మద్దతుగా అన్ని రాజకీయ పక్షాలు కలెక్టరేట్ వరకు చేరుకొని రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఇదే సమయంలో మణుగూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్ళున్న ఆర్‌టిసి బస్సుపై ఆందోళనాకారులు దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. తాత్కాలిక డ్రైవర్‌పై చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మరో డ్రైవర్ వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

RTC workers commited Suicide attempt

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖమ్మంలో ఆర్‌టిసి ఆందోళన ఉద్రిక్తం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: