పర్యాటక అభివృద్ధి దేశానికి ఆర్థిక వనరు

  దేశ ఆర్థిక ప్రగతిని రకరకాల అంశాలు ప్రభా వితం చేస్తుంటాయి, ఆయా దేశాల్లో గల ఆర్థిక , మానవ వనరులే ఆ దేశాభి వృద్ధికి మూలము. వాటిని గుర్తించి సరైన విధంగా ఉప యోగించు కోవాల్సిన భాధ్యత పాలనా యంత్రాం గాలపై ఉంటుంది. ప్రతి ఖండములోనూ , ప్రతి దేశములోనూ చూడదగ్గ అందమైన ప్రదేశాలు , కట్టడాలు అనేకం ఉంటాయి. వాటిని అభివృద్ధిపరచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయవనరులుగా తీర్చి దిద్దాలి. అంతర్జాతీయ వాణిజ్యములో టూరిజం […] The post పర్యాటక అభివృద్ధి దేశానికి ఆర్థిక వనరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశ ఆర్థిక ప్రగతిని రకరకాల అంశాలు ప్రభా వితం చేస్తుంటాయి, ఆయా దేశాల్లో గల ఆర్థిక , మానవ వనరులే ఆ దేశాభి వృద్ధికి మూలము. వాటిని గుర్తించి సరైన విధంగా ఉప యోగించు కోవాల్సిన భాధ్యత పాలనా యంత్రాం గాలపై ఉంటుంది. ప్రతి ఖండములోనూ , ప్రతి దేశములోనూ చూడదగ్గ అందమైన ప్రదేశాలు , కట్టడాలు అనేకం ఉంటాయి. వాటిని అభివృద్ధిపరచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయవనరులుగా తీర్చి దిద్దాలి. అంతర్జాతీయ వాణిజ్యములో టూరిజం కీలక పాత్ర పోసిస్తూ ఉన్నది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని ది వరల్ టూరిజం ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినది. పర్యాటక విధాన సంబంధిత అంశాల్లొ ఈ అంతర్జాతీయ టూరిజం సంస్థ ప్రపంచ వేదికగా పనిచేస్తుంది. పర్యాటక విభాగం లో గ్లోబల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అమలును ఈ సంస్థ ప్రోత్స హిస్తుంది . ఈ సంస్థలో 154 దేశాలు, 7 టెరిటరీలు సభ్య త్వం కలిగిఉన్నాయి. ప్రైవేటు రంగము, విద్యా సంస్థలు, టూరిజం అసోసియేషన్లు, స్థానిక టూరిజం అధారిటీల నుండి 400 మంది అఫిలియేట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాన కార్యాలము స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఉన్నది. 1947 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ తొలి సమావేశం జరిగింది.

ప్రభుత్వ సంస్థలు, అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల రిక్రియేషన్‌కి ఎల్‌టిసి ల సదుపాయం కల్పించిన తర్వాత – పర్యాటక రంగం ఎంతగానో పుంజుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక స్థలాలను మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. మన దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు సహజ పర్యాటక ప్రాంతాలు మరే దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. కాని పర్యాటక రంగానికి తగినన్ని నిధులు, దాని పట్ల తగినంత శ్రద్ద పెట్టకపోవడం వలన ఇన్నిరోజులు మనం ఆశించినంత గొప్పగా ఈ రంగం మన దేశంలో అభివృద్ధి చెందలేదు. కానీ ఈమధ్య కాలంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ముఖ్యంగా పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. పర్యాటకులు ఖర్చు పెట్టగలిగే ఆదాయాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. వారు తమ విశ్రాంతి సమయాన్ని తీరిక సమయాన్ని కొత్త కొత్త ఆధునిక రుచులతో వారు తమ అవసరాలను తీర్చు కొంటున్నారు. అంతే కాకుండా ఉత్పత్తులను ఉత్తమ నాణ్యతతో స్వీకరించాలని పర్యాటకులు డిమాండు చేస్తున్నారు.

రవాణా సాధనాల మౌలిక రంగాల్లో సాంకేతిక శాస్త్రం తమ ప్రభావాన్ని చూపడం వలన జంబో జెట్ లాంటి చౌకైన విమానయానం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటుగా వివిధ రకాలైన పర్యాటకులు సులువుగా చేరగలిగే విమానాశ్రాయాలు అందుబాటులోకి రావడంతో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కింది.పదవీ విరమణ పొందిన వారు సంవత్సరపు చివరలో పర్యటనల కెల్లడం వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది.కొత్తగా పెళ్లి ఐన వారు, ప్రైవేటు రంగంలో పని ఒత్తిడిని అధిగమించడానికి వారి ఉద్యోగులను కొత్త కొత్త పర్యాటక ప్రదేశాలకు ఖర్చులు భరించి మరీ పంపుతున్నారు. ఈ పద్ధతులన్నీ ఇంటర్నెట్ ద్వారా పర్యాటకరంగా ఉత్పత్తులను అమ్మడానికి దోహదపడ్డాయి. కొన్ని వెబ్ సైట్లయితే తమ వినియోగ దారుడు కోరిన విధంగా వారు కోరిన వెంటనే వారి అవసరాలకు అనుగుణంగా పర్యటన కార్యక్రమాల్ని రూపొందించాయి. పర్యాటక రంగానికి సెప్టెంబరు 11 దాడులు, బాలి లోను, వివిధ యూరొపు నగరాలలోని జరిగిన సంఘటనల ద్వారా కొంతదెబ్బ తగలడం వాస్తవమే. అలాగే 2004 డిశంబరు 26న హిందూ మహా సముద్రంలో ఏర్పడిన సునామీ దాని ద్వారా ఏర్పడిన హిందూ మహా సముద్రం ప్రాంతం లోని భూకంపాలు ఆసియా ఖండంలోని పలు దేశాల్లోని పర్యాటక రంగాన్ని దెబ్బ తీశాయి. ఈ భూకంపం వల్ల అనేక మంది ప్రజలు, పర్యాటకులు చని పోవుట జరిగింది. సునామీ వచ్చిన ప్రాంతాలను ఎక్కువ కాలం పాటు శుభ్రపరచాల్సి రావడంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతించ కపోవడంతో పర్యాటక రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

కేవలం పర్యాటక రంగం మీదే ఆధారపడి కొన్ని దేశాలు , ప్రజలు బ్రతుకుతున్నారంటే ఆశ్చర్య పోక తప్పదు. కానీ ఇది నిజం. పర్యాటక రంగం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. యుఎఇ, ఈజిప్ట్, గ్రీసు, థాయిలాండ్ దేశాలు, ద్వీపాలతో కూడుకున్న బహమాస్, ఫిజి, మాల్దీవులు, షెషిల్స్ వంటి దేశాలు పర్యాటకులు ద్వారాను వారి కందించే సేవల ద్వారాను వేలాది మంది ఆయా దేశాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తునాయి. పర్యాటక రంగంలోని అవకాశాలు, విమానయానం, విహార ఓడలు, టాక్సీలు వీటిల్లో ఉద్యోగులు వాటిలో ప్రయాణించే వారికి టికెట్లను కేటాయించే పనిలోనూ చాలా మంది ఉపాధిని పొందుతున్నారు. పర్యాట కులకు వసతి కల్పించే పనిలో కూడా అంటే హోటళ్ళను, రిసార్ట్ లోనూ అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఇది అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి,తలసరి ఆదాయం పెరుగుతుంది. ప్రజలకు జీవనోపాది దొరుకుతుంది , మన సంస్కృతీ సాంప్రదాయాలు వ్యాప్తి చెందుతాయి ,అలాగే ఇతర వ్యక్తుల, దేశస్తుల సంస్కృతీ,సాంప్రదాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యం విదేశి ఆదాయం పెరుగుతుంది.సత్వరమే అభివృద్ధి జరుగుతుంది.

ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్– పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాఛీన దేవాలయాలకు, శిల్పకళలకు, చారిత్రక కట్టడాలకు, ప్రముఖ ప్రర్యాటక , పుణ్యక్షేత్రాలు, దర్శనీయ కేంద్రాలకు సంబంధించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు . మన వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధం గా సాంస్కృతిక కార్య క్రమాలు ఏర్పాటు చేస్తారు. జిల్లా పర్యాటకాభివృద్ధి మండలి, పర్యా టక ప్రదేశాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి, పర్యాటకాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోంది .కళలు, చిత్రలేఖనం, చేతితో తయారు చేసిన వస్తువులు తదితర ఆంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ., అలాగే పర్యాటక అభివృద్ధి పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చర్చ నిర్వహించడం జరుగుతుంది.

పర్యాటక రంగం అభివృద్ధి : పర్యాటక రంగాన్ని పల్లె ప్రజలకు చేరువ చేయటంతో పాటు భారీగా పెట్టుబడులు ఆకర్షించి.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేయాలి. దేశీయ పర్యాటకుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని.. అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణలో ఐదవ స్థానంలో ఉందని ఒక సర్వేలో తేలింది.పర్యాటక ప్రాజెక్టులకు ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి రాయితీ రేట్లతో భూములు కేటాయించాలి.పెట్టుబడి పెట్టే పర్యాటక ప్రాజెక్టులకు మూలధన పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలి. వందల కోట్ల రూపాయల పైబడిన ప్రాజెక్టులకు షప్రత్యేక రాయితీలు ఇవ్వాలి . పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్ రాయితీ ఇవ్వాలి.రాష్ట్రంలో కొత్తగా హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలను నెలకొల్పాలి. పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రాంతాలు, తీరప్రాంతాలు, చారిత్రాత్మక నిర్మాణాలు, విశాలమైన జాతీయ రహదారి ఇలాంటివి పర్యాటక అభివృధ్ధికి దోహదం చేస్తాయి.ఇలాంటి మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుంది.

Tourism plays an important role in international trade

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పర్యాటక అభివృద్ధి దేశానికి ఆర్థిక వనరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: