ఓటు సరి చూసుకోండి…

  తప్పు ఒప్పులు సరి చేసుకునే అవకాశం జిల్లాలోనే పాలేరునియోజకవర్గం ముందంజ ఆన్‌లైన్‌లోను చే(మా)ర్పుల ప్రక్రియ అక్టోబర్ 15 వరకే అవకాశం ఖమ్మం : రాజ్యంగం పౌరుని కల్పించిన హక్కు ఓటు. ఇది ఎంతో విలువైనదంటే? అధికారం అప్పగించాలన్న… అందలం ఎక్కిన వాళ్లను దించాలన్న ఓటుకే సాధ్యం. అంతటి శక్తి కలిగిన ఓటును ఎన్నికలప్పుడే కాకుండ? ఎన్నికల సంఘం మా(చే)ర్పులకు కోసం ఎలక్‌ట్రోల్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చెపట్టింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వజ్రాయుధాన్ని సరి […] The post ఓటు సరి చూసుకోండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తప్పు ఒప్పులు సరి చేసుకునే అవకాశం
జిల్లాలోనే పాలేరునియోజకవర్గం ముందంజ
ఆన్‌లైన్‌లోను చే(మా)ర్పుల ప్రక్రియ
అక్టోబర్ 15 వరకే అవకాశం

ఖమ్మం : రాజ్యంగం పౌరుని కల్పించిన హక్కు ఓటు. ఇది ఎంతో విలువైనదంటే? అధికారం అప్పగించాలన్న… అందలం ఎక్కిన వాళ్లను దించాలన్న ఓటుకే సాధ్యం. అంతటి శక్తి కలిగిన ఓటును ఎన్నికలప్పుడే కాకుండ? ఎన్నికల సంఘం మా(చే)ర్పులకు కోసం ఎలక్‌ట్రోల్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చెపట్టింది.

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు
వజ్రాయుధాన్ని సరి చూసుకుంటే నయం…
పాలేరునియోజ కవర్గం మొత్తం 216622 ఓట్లు ఉండగా ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికే 74 వేల ఓట్లను వెరిఫికేషన్ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో 20వ స్థానంలో కొనసాగుతుంది. బిఎల్‌ఓలు ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ఆధర్ కార్డులను తీసుకుంటూ చేయవల్సిన మా(చే)ర్పులను అడిగి తెలుసుకుంటున్నారు.

చే(మా)ర్పులను చేసుకునే యాప్
ఓటు హక్కులో పేర్లలో పదాలు, పొల్లులు ఇంటి పేరు తప్పులు. కుటుంబ సభ్యుల ఓట్లన్ని ఒక పిఎస్‌లో ఉంటే ఒకరిది ఇంకో దగ్గర ఉంటుంది. వీటితో పాటు ఇతరద్ర సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం యాప్‌ను తయారు చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు ప్లెస్టోర్‌లో నుండి www.nvsp.in వెబ్ సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఓటు హక్కుకు సంబంధించిన ఏదైన ఒక ద్రువికరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. ఇందులోకి వెళ్లిన తర్వాత మా(చే)ర్పులు చేయాలి. అక్కడ నుండి సంబంధిత రెవెన్యూ విఆర్వో లాగిన్‌కు ఫామ్ 8 జన్‌రేట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు

బిఎల్‌ఓల ద్వారా చే(మా)ర్పులు
అందరికి స్మార్ట్ ఫోన్‌లు ఉండవు అంత టెక్నలజి తెలీదు. కాబట్టి అటువంటి వారి కోసం బిఎల్‌ఓలకు ఓ యాప్‌ను ఎన్నికల సంఘం ఇచ్చింది. ఓటర్ ఇంటి వద్దకు వెళ్లి ఓటు ద్రువికరణకు సంబంధించిన పత్రం తీసుకుని. వారు చెప్పిన సమస్యను రెవెన్యూ కార్యాలయంలో ఓటు చే(మా)ర్పుల కోసం ఏర్పాటు చేసిన దగ్గర పరిష్కారం చేస్తున్నారు.

యాప్‌లో సరి చేసుకోవడానికి ఐదు దశలు
* మీ ఎపిక్ నెంబరు ద్వారా www.nvsp.inకు లాగిన్ అవ్వడం
* మీ పేరు, పుట్టిన తేది, లింగం, ఓటరు జాబితలో ఉన్న వారితో బందుత్వం, చిరునామ, ఫోటో వివరాలు చూసుకొండి
* ఓటులో తప్పు ఉన్న చే(మా)ర్పులు ఉంటే సరైన సమాధనాన్ని ఇవ్వండి
* ఓటు ద్రువికరణ పత్రాలు… పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్, పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం వంటి వాటిలో ఏదైన ఒక దానిని అప్‌లోడ్ చేయాలి
* భవిష్యత్తుల ఇతర అవసరాల కోసం వెతుకులాడు కోకుండా ఉండేందుకు మీ ఫోన్ నెంబర్‌ను, ఈ మెయిల్‌ను అందించండి
ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి

డిప్యూటీ తహశీల్దార్, సునీల్‌రెడ్డి

ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును సరి చూసుకుని సద్వినియోగం చేసుకోవాలి. అవగాహన ఉన్న వారు ఫోన్‌లో చూసుకోచ్చు. ఎన్నికలప్పుడు ఓటులో తప్పులు ఉంటే ఇబ్బందులు పడకుండా చక్కని అవకాశం లభించింది. ఓటు హక్కుకు అర్హత కలిగిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.

Make sure the Vote is correct

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఓటు సరి చూసుకోండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: