చిత్తు చేసే చికెన్ టిక్కా

  చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా చికెన్ టిక్కాలు తింటుంటే భలే మజాగా ఉంటుంది. ఆదివారం ఇంట్లో అందరూ ఉంటారు. హాయిగా ఇలాంటి నాన్‌వెజ్ వంటలు చేసిపెడితే లాగించేస్తారు. ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంతో పాటు రుచికూడాను. వేడివేడి అన్నం, పూరీ, చపాతీల్లోకి ఇవన్నీ చాలా బాగుంటాయి. లెమన్ చికెన్ కావల్సినవి: బోన్‌లెస్ చికెన్: అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్: నాలుగు టీస్పూన్లు, పసుపు: టీస్పూను, జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు, ధనియాల పొడి: 2 టీస్పూన్లు, కారం: టీస్పూను, […] The post చిత్తు చేసే చికెన్ టిక్కా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా చికెన్ టిక్కాలు తింటుంటే భలే మజాగా ఉంటుంది. ఆదివారం ఇంట్లో అందరూ ఉంటారు. హాయిగా ఇలాంటి నాన్‌వెజ్ వంటలు చేసిపెడితే లాగించేస్తారు. ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంతో పాటు రుచికూడాను. వేడివేడి అన్నం, పూరీ, చపాతీల్లోకి ఇవన్నీ చాలా బాగుంటాయి.

లెమన్ చికెన్
కావల్సినవి: బోన్‌లెస్ చికెన్: అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్: నాలుగు టీస్పూన్లు, పసుపు: టీస్పూను, జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు, ధనియాల పొడి: 2 టీస్పూన్లు, కారం: టీస్పూను, నిమ్మరసం: 2టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పెరుగు: కప్పు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం: చికెన్ ముక్కలకు పెరుగు, పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి నూనె బయటకు వచ్చే వరకూ వేయించాలి. చివరగా నిమ్మరసం పిండాలి. లెమన్ చికెన్ సిద్ధం.

 

సింధీ చికెన్ కూర

కావలసినవి: చికెన్ :అరకిలో, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెం డు, పచ్చిమిర్చి మూడు, అల్లం ముద్ద :2 టీస్పూన్లు, వెల్లుల్లి ముద్ద: అరటీస్పూను, కొత్తిమీర తురుము: అరకప్పు, పసుపు: అరటీస్పూను, ధనియాల పొడి: ఒకటిన్నర టీస్పూన్లు, గరంమసాలా: అరటీస్పూను, పెరు గు: 3 టేబుల్ స్పూన్లు, నూనె: పావు కప్పు, మంచి నీళ్లు: అరకప్పు, ఉప్పు: రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. టొమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేసి వేయించాలి. టొమాటో ముక్కలు పూర్తిగా వేగాక చికెన్ ముక్కలు వేసి పది నిమిషాలు వేయించాలి. తరువాత ఉప్పు, పెరుగు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి సుమారు 20 నిమిషాలు ఉడికించి దించాలి.

 

చికెన్ టిక్కా మసాలా

కావలసినవి: చికెన్ ముక్కలు: అరకిలో, నిమ్మరసం: అరకప్పు, అల్లం వెల్లుల్లి: టేబుల్ స్పూను, పసుపు: అరటీ స్పూను, చికెన్ మసాలా పొడి: టేబుల్ స్పూను, టిక్కా మసాలా: టేబుల్ స్పూను, పెరుగు:కప్పు, గ్రేవీకోసం: ఉల్లి ముక్కలు: కప్పు, టొమాటో ముక్కలు: రెండున్నర కప్పులు, వెల్లుల్లి ముద్ద: టీస్పూను, అల్లం ముద్ద: టేబుల్ స్పూను, పచ్చిమిర్చి: నాలుగు, జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు: టీస్పూను, యాలకులు: రెండు, గరం మసాలా:టీస్పూను, నూనె: అరకప్పు, పాలు: అర కప్పు, వెన్న : టేబుల్ స్పూను, పచ్చిమిర్చి : రెండు, కొత్తిమీర తురుము: 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: చికెన్ ముక్కలకి నిమ్మరసం, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలాలు అన్నీ పట్టించి నాలుగు గంటలపాటు నాననివ్వాలి. పెరుగుని పలుచని బట్టలో వేసి వడకట్టాలి. నీళ్లన్నీ పోయాక దీన్ని చికెన్ ముక్కల్లో వేసి కలిపి మరో రెండు గంటలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఓవెన్‌లో గ్రిల్ చేయడం గానీ స్కూయర్‌కి గుచ్చి మంటమీద కాల్చడం గానీ చేయాలి. జీడిపప్పులో పాలు పోసి ముద్దలా రుబ్బాలి. బాణలిలో నూనె వేసి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత మిరియాలపొడి, యాలకులు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు ముద్దవేసి కలుపుతూ ఉడికించాలి. గ్రేవీ దగ్గరగా ఉడికిన తరువాత చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సిమ్‌లో రెండు నిమిషాలు ఉడికిన తరువాత గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి కలిపి దించాలి.

 

కొబ్బరి చట్నీ చికెన్ ఫ్రై

కావలసినవి: చికెన్: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: రెండు, జీలకర్ర: అరటీస్పూను, పసుపు:అరటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, నిమ్మరసం: టీస్పూను, మంచినీళ్లు: కప్పు, ఉప్పు: రుచికి సరిపడా.
కొబ్బరి చట్నీ కోసం: కొబ్బరి తురుము: కప్పు, ఉల్లికాడలు: ఐదు, ఎండుమిర్చి: పది, కరివేపాకు: 3 రెబ్బలు, అల్లం: చిన్నముక్క, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి ఎండుమిర్చి, ఉల్లికాడలు, కొబ్బరి తురుము వేసి వేయించాలి. వీటికి అల్లం, కరివేపాకు జోడించి చట్నీలా రుబ్బాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత పసుపు, కారం, చికెన్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి ఉడికించాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తరువాత కొబ్బరి చట్నీ వేసి కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించాక నిమ్మరసం పిండాలి.

Variety Chicken Recipes in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిత్తు చేసే చికెన్ టిక్కా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: