పోషకాల రారాజు

  గుడ్డు చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే, పోషకాల్లో ఇది మిన్నగా ఉంటుంది. ధరలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పిల్లలు రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పెద్దలు తింటే పనుల వల్ల నీరసించకుండా ఉంటారు. వారానికి కనీసం నాలుగు గుడ్లు తింటున్నట్లయితే డయాబెటిస్ దరిచేరదని తాజా ఫలితాలు కూడా తేల్చాయి. గుడ్డులో కండరాల ఎదుగుదలకు దోహదపడే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును కాపాడే విటమిన్‌ఎ, రోగనిరోధకతను పెంచే విటమిన్‌బి, […] The post పోషకాల రారాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గుడ్డు చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే, పోషకాల్లో ఇది మిన్నగా ఉంటుంది. ధరలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పిల్లలు రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పెద్దలు తింటే పనుల వల్ల నీరసించకుండా ఉంటారు. వారానికి కనీసం నాలుగు గుడ్లు తింటున్నట్లయితే డయాబెటిస్ దరిచేరదని తాజా ఫలితాలు కూడా తేల్చాయి. గుడ్డులో కండరాల ఎదుగుదలకు దోహదపడే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును కాపాడే విటమిన్‌ఎ, రోగనిరోధకతను పెంచే విటమిన్‌బి, ఎముకలను పటిష్టంగా ఉంచే విటమిన్‌డి, మేని వర్ఛన్సును కాపాడే విటమిన్‌ఇ, రక్తం గడ్డ కట్టేందుకు దోహదపడే విటమిన్‌కె వంటి విటమిన్లతోపాటు సక్రమమైన శరీర పోషణకు అవసరమైన కీలక ఖనిజ లవణాలు, శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మరే పదార్థంలోనూ ఇన్ని పోషకాలు ఉండవు. అందుకే గుడ్డు… పోషకాల విలువలో వెరీగుడ్డు.

మరికొన్ని నిజాలు

గుడ్డులోని పోషక విలువల సంగతి చాలా మందికి తెలిసిందే. గుడ్డు బలవర్ధకమైన ఆహారం. దీనిక్కూడా ఓ రోజుంది. గుడ్డు ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం ఈ నెల 11న ఎగ్ డే జరుపుకుంటాం.

గుడ్డులోని పచ్చసొనని తినకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ దీంట్లో విటమిన్‌డి పుష్కలంగా లభిస్తుంది.
* గుడ్డులోని కొవ్వు 5 గ్రాములకు మించి ఉండదు. గుడ్డు వల్ల శరీరానికి చేరే కేలరీలు కూడా 78 మాత్రమే.
* గుడ్డులో మన శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ ఎక్కువగా లభిస్తాయి. మాంసకృత్తుల విలువలో తల్లిపాల తర్వాతి స్థానం గుడ్డుదే.
* గుడ్డు పెంకు రంగుకు, గుడ్డులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. గుడ్డును పెట్టే పెట్ట జాతిని బట్టి పెంకు రంగు మారుతుంది.
* అరకానా జాతికి చెందిన కోడిపెట్టలు రంగు రంగుల గుడ్లు పెడతాయి. ఇవి పెట్టే గుడ్ల పై పెంకులు గులాబీ, నీలం, ఆకుపచ్చ వంటి రకరకాల రంగుల్లో ఉంటాయి.
* గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరిరా మొదటి రెండు స్థానాల్లో ఉంటే, మనది మూడో స్థానం.

గుడ్డు బరువు సాధారణంగా 5070 గ్రాముల వరకు ఉంటుంది. ఇంగ్లాండులోని మాంచెస్టర్ వద్ద మెల్లర ప్రాంతంలో 1896వ సంవత్సరంలో స్టాఫోర్డ్ అనే అసామి పెరట్లో పెంచుకుంటున్న కోడిపెట్ట అత్యంత భారీ గుడ్డు పెట్టింది. ఏకంగా 12.2 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడుల్పు ఉన్న ఆ గుడ్డు బరువు 340 గ్రాములు. గిన్నెస్ బుక్కులోకి ఎక్కిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇంగ్లాండ్‌లోనే 2010లో ఇప్‌స్విచ్ ప్రాంతంలో ఒక కోడిపెట్ట 8.3 అంగుళాల పొడవు, 3.5 అంగుళాల వెడల్పుతో గుడ్డు పెట్టింది.

75.1% నీరు
12.5% మాంస కృత్తులు, ౦.9% విటమిన్లు,
౦.9% విటమిన్లు, ఖనిజ లవణాలు
93% కొవ్వులు

182 గుడ్లు ప్రపంచంలో ఏటా తలసరి వినియోగం

259 గుడ్లు సగటు కోడిపెట్ట ఏటా పెట్టే గుడ్లు

78 క్యాలరీలు ఒక గుడ్డులో లభించే శక్తి

58 గ్రాములు సగటు గుడ్డు బరువు

140 గుడ్లు ఒక ఆస్ట్రిచ్ గుడ్డుతో సమానం

 

Egg Nutrients and Benefits

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పోషకాల రారాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.