ఇ-సిగరెట్లకు ఇక సెలవా మరి!

ఇ సిగరెట్ వంద పఫ్‌లు 10 సిగరెట్లు తాగడంతో సమానం. రసాయనాలు పలుచని, చిక్కని రూపంలో దొరుకుతాయి. సంతృప్తి పెరగడానికి వీటి ఘాటును పెంచుతూ పోతారు. నిజంగానే గొలుసు కట్టు ధూమపానాన్ని వదిలిపెట్టాలనే సంకల్పంతో ఇ సిగరెట్ జోలికి వెళితే ఫలితం ఉండవచ్చు గాని ఒక దాని చోట మరో దానికి బానిస అయితే నష్టమే ఎక్కువ. లాగే దమ్ము దీర్ఘత, లోపలి దాకా పీల్చుకోవడం, అదే పనిగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదని ప్రపంచ […] The post ఇ-సిగరెట్లకు ఇక సెలవా మరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇ సిగరెట్ వంద పఫ్‌లు 10 సిగరెట్లు తాగడంతో సమానం. రసాయనాలు పలుచని, చిక్కని రూపంలో దొరుకుతాయి. సంతృప్తి పెరగడానికి వీటి ఘాటును పెంచుతూ పోతారు. నిజంగానే గొలుసు కట్టు ధూమపానాన్ని వదిలిపెట్టాలనే సంకల్పంతో ఇ సిగరెట్ జోలికి వెళితే ఫలితం ఉండవచ్చు గాని ఒక దాని చోట మరో దానికి బానిస అయితే నష్టమే ఎక్కువ. లాగే దమ్ము దీర్ఘత, లోపలి దాకా పీల్చుకోవడం, అదే పనిగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. పైగా ఇ సిగరెట్ గర్భిణిలకు నష్టదాయకమని సంస్థ హెచ్చరిస్తోంది. మరో ప్రమాదకరమైన విషయమేమంటే సెల్‌ఫోను బ్యాటరీలు పేలుతున్నట్లే ఇ సిగరెట్‌లోని బ్యాటరీ పేలి గాయాలపాలైన సందర్భాలూ ఉన్నాయి.

ఇ సిగరెట్ అంటే ఏమిటో మనలో చాలా మందికి తెలియక ముందే అది దేశంలో నిషేధింపబడింది. సెప్టెంబర్ 18న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పాత్రికేయుల ముందు నిషేధం ప్రకటన చేశారు. ఇ సిగరెట్ల రద్దు తక్షణం అమలులోకి వస్తుందని కూడా ఆ ప్రకటనలో ఉంది. ఇక నుంచి ఇ సిగరెట్ల వాడకంతో పాటు వాటి అమ్మకం, నిలువ చేయడం, తయారీ, రవాణా, వ్యాపార ప్రకటనలు అన్నీ చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయి. దీనిని అతిక్రమించిన వారికి ఏడాది జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించబడుతుంది.

మామూలు పొగాకు నింపిన సిగరెట్ రూపంలోనే కనబడే ఎలక్ట్రానిక్ సిగరెట్ ఒక సాంకేతిక పరికరం. దానిని ఎండ్స్ అని పిలుస్తారు. అది ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ డివైజ్ అన్నమాటకు పొట్టి రూపం. సిగరెట్ లేదా అంతకన్నా కాస్తా పొడవుగా ఉండే ఈ గొట్టంలో సగం దాకా బ్యాటరీ ఉంటుంది. పావు వంతులో ద్రవ రూపంలో ఉండే నికోటిన్ బుడ్డీ ఉంటుంది. దానిని ఆనుకొని వేడి పరచే తీగె ఉంటుంది. బటన్ నొక్కడంతో బ్యాటరీ శక్తితో తీగ వేడెక్కి నికోటిన్‌ను వాయు రూపంలోకి మార్చుతుంది. పీల్చితే సిగరెట్ తాగిన అనుభూతి కలుగుతుంది. ఒకసారి పరికరం కొనుక్కొని ఖాళీ అయిన కొద్దీ నికోటిన్ బుడ్డీని మార్చితే చాలు. సిగరెట్ రూపంలోనే కాకుండా పెన్ ఆకారంలో, సిగార్ పైపుగా కూడా లభిస్తాయి.

2013 నుండి మన దేశ మార్కెట్‌లోకి వచ్చిన ఇ సిగరెట్‌పై ఎలాంటి చట్టాల రూపకల్పన జరగలేదు. మామూలు ఎలక్ట్రానిక్ వస్తువు మాదిరే మార్కెట్‌లో అమ్ముడయి పోతూ వాడబడుతోంది. ధూమపాన వ్యవసనపరులకు ఆ దురలవాటును దూరం అవడంతో ఇది ఉపయోగపడుతుందనే భావనతో సర్వత్రా ప్రోత్సాహమే లభించింది. ఇ సిగరెట్ వాడకం ద్వారా పొగ త్రాగే అలవాటును మానుకోండి అని వ్యాపార ప్రకటనలు కూడా వచ్చా యి. పొగాకు సిగరెట్‌ను ముట్టిస్తే ఒకేసారి పూర్తిగా తాగివేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బ తింటుంది. అదే ఇ సిగరెట్ అయితే ఒకటి రెండు దమ్ములు లాగి ఆపవచ్చు. నికోటిన్‌లా రుచిని ఇచ్చే ఇతర రసాయనాలు ఇందులో ఉండడం వల్ల హాని తక్కువ అనే అనుకూల అంశాలు ముందుకొచ్చాయి. వీటిలో నికోటిన్‌కు బదులు ప్రొపిలిన్ గ్లికోల్‌ను వాడుతారు. పైగా ఇ సిగరెట్ తాగడం వల్ల పొగరాదు, పక్క వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బహిరంగ స్థలాల్లో తాగరాదనే నిబంధన వర్తించదు. ఇలా రకరకాల అనుకూల దృక్పథంతో మార్కెట్‌లో విస్తరించిందనవచ్చు.

క్రమంగా ఇ సిగరెట్ వల్ల కలుగుతున్న దుష్పరిణామాలు బయటపడసాగాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థు లు, యువత దీని అలవాటుకు లోనవుతున్నారు. మన దేశం మై నర్ పిల్లలకు సిగరెట్ అమ్మడం నేరం, దుకాణాల వద్దే సిగరెట్ ముట్టించుకొని దమ్ములాగడం నిషేధం. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు ఉండకూడదు. జనవరి 2016లో వచ్చిన చట్ట సవరణ ప్రకారం 18 ఏళ్ల రాని పిల్లలకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మితే రూ. లక్ష జరిమానాతో పాటు 7 ఏండ్లు దాకా జైలు శిక్ష పడుతుంది. ఈ నిబంధనల అమలు ఎంత పలుచగా ఉందో అందరికీ తెలుసు.
మైనర్ పిల్లలు ఇ సిగరెట్ కొనడానికి పాన్ డబ్బా వద్దకు వెళ్లే పని లేదు. దానిని ఎక్కడైనా దాచుకోవచ్చు, వాడుకోవచ్చు. పొగరాదు కాబట్టి దొరికిపోయే చాన్సు లేదు. ఇ సిగరెట్‌లు, వాటిలో వాడే ఉత్ప్రేరకాలు ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే దుకాణాల్లో లభిస్తాయి. అమ్మకాలకు ఏ చట్టం అడ్డు రాదు. నిషేధానికి ముందు దాకా ఇవి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంట్ ఆన్‌లైన్ సంస్థల్లో కూడా లభించాయి. ఈ రకంగా ఇ సిగరెట్ లాభాల చిట్టాలోంచి నష్టాల జాబితాలోకి చేరిపోయింది.

మైనర్లు, యువత వాడకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇ సిగరెట్ల రూపాలు ఆకర్షణీయంగా తయారయ్యాయి. వాడే రసాయనాల్లో రుచులు పెరిగిపోయాయి. వీటిని అతిగా వాడడం వల్ల లేత ఊపిరితిత్తులు ప్రభావితమై శ్వాస సంబంధిత వ్యాధులు దాడి చేస్తున్నాయి. గుండె కూడా దెబ్బ తింటున్నదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇ సిగరెట్ వంద పఫ్‌లు 10 సిగరెట్లు తాగడంతో సమానం. రసాయనాలు పలుచని, చిక్కని రూపంలో దొరుకుతాయి. సంతృప్తి పెరగడానికి వీటి ఘాటును పెంచుతూ పోతారు. నిజంగానే గొలుసు కట్టు ధూమపానాన్ని వదిలిపెట్టాలనే సంకల్పంతో ఇ సిగరెట్ జోలికి వెళితే ఫలితం ఉండవచ్చు గాని ఒక దాని చోట మరో దానికి బానిస అయితే నష్టమే ఎక్కువ. లాగే దమ్ము దీర్ఘత, లోపలి దాకా పీల్చుకోవడం, అదే పనిగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. పైగా ఇ సిగరెట్ గర్భిణిలకు నష్టదాయకమని సంస్థ హెచ్చరిస్తోంది.

మరో ప్రమాదకరమైన విషయమేమంటే సెల్‌ఫోను బ్యాటరీలు పేలుతున్నట్లే ఇ సిగరెట్‌లోని బ్యాటరీ పేలి గాయాలపాలైన సందర్భాలూ ఉన్నాయి. మార్కెట్‌లోకి వందల రకాల ఇ సిగరెట్లు వచ్చినా వాటిలో ఒక్కటీ మన దేశ ఉత్పత్తి కాదు. అన్నీ చైనా, అమెరికా, హాంకాంగ్, జర్మనీ నుండి దిగుమతి చేసుకున్నవే. వీటి దిగుమతిపై ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేవు.
మన కన్నా ముందే ప్రపంచంలో సుమారు 25 దేశాలు వీటిని నిషేధించాయి. మన దేశంలో సైతం ఇప్పటికే 15 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిషేధం అమలులో ఉంది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు లేవు. ఈ సిగరెట్ నిషేధం వార్త బయటపడగానే పొగాకు సిగరెట్ల తయారీ కంపెనీల షేర్లు పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్‌లో ఐటిసి షేర్ విలువ 1.5%, గాడ్‌ఫ్రే ఫిలిప్‌ది 8% ఎగబాకింది.

అమెరికాకు చెందిన జాల్ లాబ్స్, ఫిలిప్ మోరీస్ సంస్థలు మన దేశంలో ఇ సిగరెట్ల వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు పెట్టుబడులు పెట్టాయి. కేవలం ఉత్పత్తి, అమ్మకమే మిగిలి ఉంది. ఈ స్థాయిలో ఆశనిపాతంగా వచ్చిన రద్దు వార్త మింగుడు వాటికి పడడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై 27.9.2019న కోల్‌కతాలో రెండు కంపెనీలు కోర్టు కెళ్లాయి. పొగాకు సిగరెట్ల పెట్టెలపై ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను ముద్రించి వాడకానికి, అమ్మకాలకు అనుమతినిచ్చినట్లు ఎలక్ట్రానిక్ సిగరెట్లను కూడా అలా వదిలివేయాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే 201617 ప్రకారం మన దేశంలో 3 కోట్ల మంది పొగాకు వాడుతున్నారు. చైనా తర్వాత రెండో స్థానం మనదే.

క్రమంగా తగ్గుతున్న మామూలు సిగరెట్ల అమ్మకాలు పెంచి తయారీ సంస్థలకు సహకరించాలనే ఈ రద్దుకు ప్రభుత్వం పాల్పడిందనే ఓ విమర్శ వచ్చింది. ఎందుకంటే ఇ సిగరెట్ సామాగ్రి అంతా పర దేశాల ఉత్పత్తులే. తక్షణ నిషేధం అమలులోకి వచ్చినందున తమ వద్ద ఉన్న ఇ సిగరెట్లను సమీప పోలీసు స్టేషన్లలో అప్పగించాలని ప్రభుత్వం అంటోంది. ఈ రద్దుని వ్యతిరేకిస్తూ 28 సెప్టెంబర్ నాడు స్వయంగా వాటి వాడకం దారులు ఢిల్లీలో ప్రదర్శన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం వెనక్కి తీసుకోమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. చాటు మాటు అమ్మకాలకు ఆస్కారం ఉన్నందున ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

E Cigarette Banned States in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇ-సిగరెట్లకు ఇక సెలవా మరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.