ఇతరులను నవ్వుతూ పలకరిద్దాం!

  ఊరికే ముఖం ముడుచుకుని కూర్చోవడం కంటే.. నవ్వితే బాగుంటుంది.. నవ్వడం.. నవ్వించడం.. నవ్వుతూ ఉండడం.. తలుచుకుంటూనే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది కదా! ప్రస్తుతం తీరిక లేని జీవితాల్లో నవ్వుతూ గడపడమనేది చాలా కష్టంగా మారింది.. ఎన్నో ఒత్తిడులు ఇంట్లో, బయట, ఆఫీస్ ప్రతీ ఒక్క విషయంలోనూ ఒత్తిడులతో గడిపేస్తున్నారు ప్రజలు. దీంతో ఎన్నో ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిజంగా నవ్వడానికి ఆరోగ్యానికి సంబంధముందా అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్తంత నవ్వితే ఆ […] The post ఇతరులను నవ్వుతూ పలకరిద్దాం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఊరికే ముఖం ముడుచుకుని కూర్చోవడం కంటే.. నవ్వితే బాగుంటుంది.. నవ్వడం.. నవ్వించడం.. నవ్వుతూ ఉండడం.. తలుచుకుంటూనే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది కదా! ప్రస్తుతం తీరిక లేని జీవితాల్లో నవ్వుతూ గడపడమనేది చాలా కష్టంగా మారింది.. ఎన్నో ఒత్తిడులు ఇంట్లో, బయట, ఆఫీస్ ప్రతీ ఒక్క విషయంలోనూ ఒత్తిడులతో గడిపేస్తున్నారు ప్రజలు. దీంతో ఎన్నో ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిజంగా నవ్వడానికి ఆరోగ్యానికి సంబంధముందా అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్తంత నవ్వితే ఆ ఒత్తిడి దూరమవుతుంది.

ఈ కారణంగా బీపీ, హైపర్ టెన్షన్, ఈ కారణంగా వచ్చే గుండె సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. ఈ కారణంగానే చాలా మంది వైద్యులు సంతోషంగా ఉండండంటూ చెబుతుంటారు. ఇక్కడ బాధపడాల్సిన విషయమేంటంటే ఖర్చుపెట్టని నవ్వుని కూడా మనం ఖరీదు చేసేశాం. మనసులో ఎన్నో పెట్టుకుని ఎదుటివారిని చూడగానే ముఖం తిప్పుకోవడం వీరితో మనకేంటంటూ బతికేస్తున్నాం. ఈ పుణ్యమా అనే లాఫింగ్ క్లబ్స్ వెలిశాయి. నవ్వు విషయంలో పిసినారితనం చూపకుండా హాయిగా నవ్వేయండి. చుట్టూ ఉన్నవారిని నవ్వించండి. ఇలాంటివారే ప్రతీ విషయంలోనై పైకి ఎదుగుతారని చెబుతున్నాయి పరిశోధనలు.

Let us speak to another person with smile

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇతరులను నవ్వుతూ పలకరిద్దాం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: